రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..

Ratan Tata : రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు.. గత ఏడాది అక్టోబర్ 9న కన్నుమూశారు భారతీయ పారిశ్రామిక రంగంలో గొప్ప మార్గదర్శిగా నిలిచిన ఆయన తన ఆస్తులను ఎలా విభజించారనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా, ఆయన వీలునామా వివరాలు వెల్లడయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.రతన్ టాటా తన సంపదలో అధిక శాతాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించారు. అతని పేరుతో ఉన్న ఎండోమెంట్ ఫౌండేషన్ వివిధ ట్రస్టులకు దాదాపు రూ.3,800 కోట్లు విరాళంగా ఇచ్చారు. టాటా సన్స్‌లో ఉన్న వాటాలతో పాటు ఇతర ఆస్తులను కూడా ఇందులో చేర్చారు.

Advertisements
రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు..
Ratan Tata రతన్ టాటా వీలునామాలో ఆసక్తికర అంశాలు

ఒకవేళ ఈ షేర్లను విక్రయించాల్సి వస్తే, ప్రస్తుత వాటాదారులకే అమ్మాలని ఆయన వీలునామాలో స్పష్టంగా పేర్కొన్నారు.తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్ దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు స్టాక్స్, ఖరీదైన వాచ్‌లు పెయింటింగ్స్ వంటి విలువైన వస్తువులు అందజేశారు.టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన మోహిన్ ఎం.దత్తాకు రూ.800 కోట్ల ఆస్తులను అప్పగించారు.రతన్ టాటా సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు జుహులోని బంగ్లాలో వాటా, వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను ఇచ్చారు.ఇక అలీబాగ్‌లో ఉన్న బంగ్లాను మూడు పిస్టోళ్లను తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీ పేరిట రాసినట్లు తెలుస్తోంది.జీవనకాలంలో వీధి కుక్కల సంరక్షణకు ఆసుపత్రులను ఏర్పాటు చేసిన రతన్ టాటా, వాటి సంరక్షణ కోసం రూ.12 లక్షల నిధులను ఏర్పాటు చేశారు.ప్రతి మూడు నెలలకు రూ.30,000 చొప్పున ఖర్చు చేసేలా నిధులను కేటాయించారు.తన జీవితాంతం తనకు తోడుగా ఉన్న శంతను నాయుడు విద్యా రుణాన్ని పూర్తిగా మాఫీ చేశారు. తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి ఇచ్చిన రూ.23 లక్షల అప్పును కూడా రద్దు చేశారు.రతన్ టాటాకు విదేశాల్లో రూ.40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

సీషెల్స్‌లో భూములు, మోర్గాన్ స్టాన్లీ, వెల్స్ ఫార్గో వంటి ఆర్థిక సంస్థల్లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. ఆల్కోవా కార్పొరేషన్, హౌమెట్ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో షేర్లు కూడా ఉన్నాయి.అయన వద్ద 65 ఖరీదైన చేతి గడియారాలు ఉన్నట్లు సమాచారం.ఈ వీలునామా 2022 ఫిబ్రవరి 23న రాశారు. దీనిపై ప్రస్తుతం బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆస్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడే అవకాశం ఉంది.

Related Posts
జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాపణ ఇచ్చినట్టు వైట్ హౌస్ ప్రకటన
joe biden scaled

డిసెంబర్ 1న, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు సంబంధించిన ఫెడరల్ గన్ మరియు పన్నుల నేరాలకు సంబంధించిన శిక్షలను "పూర్తిగా మరియు Read more

Vishwak Sen: టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ

టాలీవుడ్ యువహీరో విశ్వక్ సేన్ ఇంట్లో జరిగిన చోరీ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ ఫిలింనగర్‌ రోడ్డు నెంబర్‌- 8 లోని విశ్వక్ సేన్ Read more

చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: CM చంద్రబాబు
cbn 0chit

ఆంధ్రప్రదేశ్‌లోని సాయిసాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల ఆయన సచివాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, Read more

Modi : మోదీ చాలా తెలివైన వ్యక్తి – ట్రంప్
సుంకాలు తగ్గించేందుకు మోదీ సర్కార్‌ సిద్ధం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో, మోదీని "చాలా తెలివైన వ్యక్తి"గా అభివర్ణించారు. ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×