Priyanka Gandhi took oath as MP today

నేడు ఎంపీగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: వయనాడ్‌ ఎంపీగా ఈరోజు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియాంకా గాంధీ ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టనున్నగా, పార్లమెంటులో ముగ్గురు గాంధీలు ఎంపీలుగా దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం సోనియా రాజ్యసభలో ఎంపీగా ఉండగా, రాహుల్‌, ప్రియాంక లోక్‌సభలో కూర్చోనున్నారు. తాజాగా వెలువడిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి ప్రియాంకా గాంధీ రికార్డు మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

రాహుల్‌ గాంధీ సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలి నుంచి విజయం సాధించారు. అయితే వయనాడుకు రాజీనామా చేసిన ఆయన ప్రస్తుతం రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో వయనాడ్‌కు ఉపఎన్నిక అనివార్యమైంది. గత నెల జరిగిన బైపోల్‌లో ప్రియాంకా బరిలోకి దిగారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆమె 4.8 లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 3.64 ఓట్లతో ఉన్న రాహుల్‌ పేరుతో ఉన అత్యధిక మెజార్టీ రికార్డును ఆమె తుడిచివేశారు. కాగా, నాందేడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్‌ కూడా గురువారం ప్రమాణం చేయనున్నారు.

Related Posts
గ్రామసభల్లో ప్రజాగ్రహం
peoples fires on the congre

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసాపై అధికారులు చేపట్టిన గ్రామసభలు రసాభాసగా మారాయి. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా ప్రభుత్వం ముందే జాబితా ఎలా ప్రకటించిందంటూ ప్రజలు Read more

ఆ ప్రచారంలో నిజం లేదు – ఇళయరాజా
ilayaraja

శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం గర్భగుడిలోకి సంగీత దిగ్గజం ఇళయరాజా ప్రవేశించేందుకు యత్నించారని వచ్చిన వార్తలపై ఆయన ఘాటుగా స్పందించారు. “ఇలాంటి ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నాపై Read more

Chandrababu: ప్రపంచం భారత్ వైపు చూస్తోందన్న చంద్రబాబు
Chandrababu: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన 'ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025' కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ Read more

Etela Rajender : డీలిమిటేషన్‌తో ఎంపీ సీట్లు తగ్గుతాయని కేంద్రం ఎక్కడ చెప్పింది : ఈటల
Where did the Center say that MP seats will decrease with delimitation.. Etela Rajender

Etela Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రాంతీయ పార్టీల వలే కాంగ్రెస్ దిగజారి Read more