Prime Minister Modi dedicated warships to the nation

యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని

ముంబయి: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై.. యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి (INS Nilagiri), ఐఎన్ఎస్ సూరత్ (INS Surat), ఐఎన్ఎస్ వాఘ్‌షీర్‌లను (INS Waghgheer) బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఒకేసారి 3 యుద్ధ నౌకలను ప్రారంభించడం దేశ చరిత్రలోనే తొలిసారి. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న భారత్‌కు ఇది పెద్ద ముందడుగే అని చెప్పాలి.

Advertisements
image
image

ఈ మూడు మేడిన్‌ ఇండియావి అని అన్నారు. తాము విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పనిచేస్తామని చెప్పారు. రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియా ఆవిష్కృతం అవుతోందన్నారు. అలాగే, వన్‌ ఎర్త్‌.. వన్‌ ఫ్యామిలీ.. వన్‌ ఫ్యూచర్‌ అని అన్నారు. ఈ మూడు యుద్ధ నౌకలు భారత్‌కు మరింత శక్తినిస్తాయి అని చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ కార్గో మార్గాలను భారత్‌ కాపాడుతోందన్నారు. నేవీ బలోపేతం వల్ల ఆర్థిక ప్రగతి కూడా కలుగుతుందన్నారు.

ఐఎన్ఎస్ సూరత్..

ఐఎన్ఎస్ సూరత్ పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తోన్న నాలుగో యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునికి డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇది ఒకటి. ఇందులో స్వదేశీ వాటా శాతం 75 శాతం. ఈ యుద్ధ నౌకలో నెట్ వర్క్ సెంట్రిక్ సామర్థ్యం సహా అధునాతన ఆయుధ – సెన్సార్ వ్యవస్థలు ఉన్నాయి.

ఐఎన్ఎస్ నీలగిరి..

ఐఎన్ఎస్ నీలగిరి పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. అధునాతన టెక్నాలజీతో దీన్ని రూపొందించగా.. ఇది తర్వాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను సూచిస్తోంది.

ఐఎన్ఎస్ వాఘ్‌షీర్..

ఐఎన్ఎస్ వాఘ్‌షీర్ పీ75 కింద రూపొందిస్తున్న ఆరో చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.

Related Posts
ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య
ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ ఆత్మహత్య

ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభినవ్ సింగ్ బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు తన గదిలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా నుంచి బెంగళూరుకు Read more

SLBC టన్నెల్లో రోబోలతో సెర్చ్ ఆపరేషన్
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కష్టంగా మారిన మృతదేహాల వెలికితీత

SLBC టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకీ కోసం గత 23 రోజులుగా కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సహాయక బృందాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ, Read more

తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’
Extreme Cold

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రజలను గజగజ వణికిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా నమోదవుతోంది. బేల ప్రాంతంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత Read more

Bhubharathi : భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది ఛాన్స్
bhubharathi nelakondapalli

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ‘భూభారతి’ వ్యవస్థలో భూరికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసుకునేందుకు రైతులు, భూ యజమానులకు పెద్ద ఊరట లభించింది. భూరికార్డుల్లో ఉన్న తప్పుడు Read more

Advertisements
×