SunithaWilliams :సునీత విలియమ్స్ ను భారతదేశానికి రావాలని కోరిన ప్రధాని మోదీ

SunithaWilliams :సునీత విలియమ్స్ ను భారతదేశానికి రావాలని కోరిన ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్  రాసిన లేఖలో ‘మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, మా హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు’ అని ప్రధాని మోదీ రాశారు. ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ భారతమాత బిడ్డ కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

Advertisements

లేఖ

మార్చి 1న ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌కు ఈ లేఖ రాశారు. ఇందులో ప్రధానమంత్రి, ‘భారత ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఒక కార్యక్రమంలో ప్రముఖ వ్యోమగామి మైక్ మాసిమినోను కలిశాను. సంభాషణ సమయంలో సునీత పేరు ప్రస్తావనకు వచ్చింది. సునీత గురించి, ఆమె పని గురించి ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాము. దీని తర్వాత లేఖ రాయకుండా ఉండలేకపోయాను.’’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , మాజీ అధ్యక్షుడు బిడెన్‌ను కలిసినప్పుడల్లా, సునీత గురించి అడిగేవాడినని. మీ విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు ఎల్లప్పుడూ గర్వపడుతున్నారు. ఇటీవలి సంఘటనలు మీ స్ఫూర్తిదాయకమైన దృఢ సంకల్పాన్ని గుర్తు చేశాయి. భారత ప్రజలు మీ ఆరోగ్యం కోసం, మిషన్ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. అంటూ ప్రధాని రాసిన లేఖలో పేర్కొన్నారు.

దీపక్ భాయ్ ఆశీస్సులు

‘మీ తల్లి బోనీ పాండ్యా మీరు సురక్షితంగా తిరిగి రావడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దివంగత దీపక్ భాయ్ ఆశీస్సులు కూడా మీకు ఉన్నాయని పూర్తిగా నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాశారు. 2016లో అమెరికా పర్యటనలో మీతో పాటు ఆయనను కలిశాను. మీరు అంతరిక్షం నుండి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాము. భారతదేశ గొప్ప కుమార్తెకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి సంతోషకరమైన విషయం.’’ అంటూ ప్రధాని మోదీ రాశారు. ఈ లేఖలో, ప్రధాని మోదీ సునీతా విలియమ్స్ భర్త మైఖేల్ విలియమ్స్‌ను కూడా అభినందించారు. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలు గడిపిన తర్వాత నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రాబోతున్నారు. ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్‌లతో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ క్రూ-9 బయలుదేరింది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత, సునీత విలియమ్స్ త్వరలో భారతదేశానికి రావచ్చు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు సునీత విలియమ్స్‌కు ఒక లేఖ రాశారు. క్షేమంగా భూమికి చేరుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని, ఆ వెంటనే భారతదేశానికి రమ్మని ఆహ్వానించారు.

Related Posts
ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ -జెలెన్స్కీ సమావేశం
నా స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు: జెలెన్స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ట్రంప్ జెలెన్స్కీపై తీవ్రంగా Read more

లీకైన అమెరికా పత్రాలు
20

తాజాగా లీకైన అమెరికా పత్రాలు ఇజ్రాయెల్ యొక్క ఇరాన్‌పై దాడి పథకాలను మరింత వివరంగా వెల్లడిస్తున్నాయి. ఈ పత్రాల్లో ఇజ్రాయెల్ కేబినెట్ మరియు భద్రతా నిపుణుల మధ్య Read more

బుమ్రా చరిత్ర సృష్టించాడు
బుమ్రా చరిత్ర సృష్టించాడు

భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా జనవరి 1, బుధవారం చరిత్ర సృష్టించాడు. తాజా ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో, బుమ్రా భారత బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, Read more

జనవరి 20న కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం..!
Trumps speech to the supporters soon

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ మెజార్టీతో ఎంపికైన విషయం తెలిసిందే. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలకు సంబధించిన పూర్తి ఫలితాలు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×