పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం రీరికార్డింగ్, డబ్బింగ్, గ్రాఫిక్స్ (VFX) వంటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ వేసవిలో భారీ విజువల్ ట్రీట్
ఈ సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చారిత్రక నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ గంభీరమైన వీరుడి పాత్రలో అలరించనున్నాడు. యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం, విజువల్స్ అన్నింటినీ సమపాళ్లలో మిళితం చేస్తూ ప్రేక్షకులకు సినిమా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు.

కీరవాణి సంగీతం మరో హైలైట్
ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్నీక్ పీక్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సమయానికి విడుదల చేయడానికి టెక్నికల్ టీమ్ అహర్నిశలు శ్రమిస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, చారిత్రక చిత్రాలను ఇష్టపడే ప్రతి సినీ ప్రేమికుడికీ ఈ సినిమా ఓ ప్రత్యేక అనుభూతి కలిగించనుంది.