కన్నడ బుల్లితెర పై తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి వైష్ణవి గౌడ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అడుగుపెట్టబోతుంది. ఆమె తన ప్రియుడు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అనుకూల్ మిశ్రాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ నిశ్చితార్థ వేడుక ఇవాళ ఘనంగా జరిగింది. వైష్ణవి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేయడంతో నెటిజన్ల మధ్య ఇది హాట్ టాపిక్‌గా మారింది.
అభిమానులకు పెద్దసర్ప్రైజ్
వైష్ణవి ప్రేమ వ్యవహారం గురించి ఇంతవరకు ఎక్కడా పంచుకోకపోవడంతో ఆమె నిశ్చితార్థం వార్త అభిమానులకు పెద్దసర్ప్రైజ్‌గా మారింది. ఆమె ప్రియుడి గురించి ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పకపోవడంతో చాలా మంది షాక్ అయ్యారు. నిశ్చితార్థ ఫొటోల్లో ఇద్దరూ ఎంతో సంతోషంగా కనిపించారు. సంప్రదాయ వేషధారణలో వీరి జోడీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.

వైష్ణవి గౌడకు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ
ప్రస్తుతం వైష్ణవి గౌడకు అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్లు, సెలబ్రిటీల నుంచి హృదయపూర్వక అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే వీరి వివాహ వేడుక గురించి అధికారికంగా వెల్లడించే అవకాశముందని అంచనా. వైష్ణవి గౌడ కొత్త జీవితం సంతోషంగా కొనసాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.