పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 21న (సోమవారం) వాటికన్‌లోని కాసా శాంటా మార్టాలో ఉన్న తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈస్టర్ మండే రోజు పోప్ ఫ్రాన్సిస్ మరణించినట్లు వాటికన్ న్యూస్ వెల్లడించింది. అనారోగ్యంతో చికిత్స తీసుకున్న తర్వాత చాలా రోజులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన ప్రజలకు కనిపించారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే ఆయన కన్నుమూశారు. ‘స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.35కు (జీఎంటీ ప్రకారం 5.35కు) ఫ్రాన్సిస్, రోమ్‌కు చెందిన బిషప్, తన తండ్రి స్వగృహానికి తిరిగి చేరుకున్నారు.” అని కార్డినల్ కెవిన్ ఫార్రెల్ ఓ ప్రకటనలో తెలిపారు. తన టెలిగ్రామ్ చానల్‌లో వాటికన్ ఈ విషయాన్ని ప్రచురించింది.
2013లో పోప్ బెనడిక్ట్ 16కి వారసుడిగా ఎంపికైనప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వ్యక్తి. రోమన్ కాథలిక్ చర్చ్‌కు నాయకత్వం వహించేందుకు ఎన్నికైన లాటిన్ అమెరికన్, తొలి జెస్యూట్( జీసస్ సమాజపు సభ్యుడు) కూడా ఆయనే.
ఎక్స్‌లో ఆయనకు 18.4 మిలియన్ల మంది ఫాలోయర్లు
పోప్‌గా బాధ్యతలు చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కాథలిక్కులు, ఇతర మత విశ్వాసులలో నిర్వహించిన సర్వేలో ఆయనకు అత్యున్నత ప్రజాదరణ ఉన్నట్లు తేలింది. ఎక్స్‌లో ఆయనకు 18.4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. సమస్యల్ని స్వయంగా తానే పరిష్కరించాలనే ఆలోచన ఆయనకు వాటికన్ లోపల, బయట అనేకమంది వ్యతిరేకులను కూడా తెచ్చిపెట్టింది.


Read Also: కెనడా ప్రధాన మంత్రి కావాలనే లక్ష్యం తో దూసుకువెళుతున్న పొయిలీవ్రే