हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan : పాక్ F-16 యుద్ధ విమానాల వినియోగంపై అమెరికా ఆంక్షలు

Divya Vani M
Pakistan : పాక్ F-16 యుద్ధ విమానాల వినియోగంపై అమెరికా ఆంక్షలు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి.తాజా పరిణామాల మధ్య, ఏ దేశం గాలిలో పైచేయి సాధిస్తుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎలాంటి ఘర్షణ వచ్చినా, విజయం వాయుసేన చేతిలోనే ఉందని రక్షణ నిపుణులు అంటున్నారు.భారత వాయుసేనకు 680కి పైగా యుద్ధ విమానాలున్నాయి.ఇందులో Su-30 MKI, Rafale, Mirage 2000 వంటి శక్తిమంతమైన ఫైటర్లు ఉన్నాయి. ఇక పాకిస్థాన్ వద్ద ఉన్నవి సుమారు 410.వీటిలో 75 మాత్రమే అమెరికా తయారీ F-16 ఫైటర్లు. ఆ సంఖ్య పరంగా కూడా, సామర్థ్యం పరంగా కూడా భారత్ ముందు పాక్ వెనకబడి ఉంది.F-16లు పాకిస్థాన్ గర్వంగా చూసే జెట్స్. కానీ వీటిపై ఆంక్షలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు.అమెరికా ఈ విమానాలను ఉగ్రవాదులపై కౌంటర్ ఆపరేషన్స్ కోసమే ఇచ్చింది.భారతపై పోరాటానికి వీటిని వాడితే, అమెరికా పాక్‌కు విడిభాగాల సరఫరా నిలిపేస్తుంది.

Pakistan పాక్ F 16 యుద్ధ విమానాల వినియోగంపై అమెరికా ఆంక్షలు
Pakistan పాక్ F 16 యుద్ధ విమానాల వినియోగంపై అమెరికా ఆంక్షలు

మెంటెనెన్స్ ఒప్పందాలు కూడా రద్దవుతాయి.ఈ కారణంగా, పాక్ ఈ జెట్ల వాడకంపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.ఒకవేళ దీనిని ఉల్లంఘిస్తే, F-16లు పాక్ చేతిలో వినియోగానికి పనికిరాని ఇనుము ముక్కలుగా మిగిలిపోవచ్చు.F-16లపై నిషేధాల నేపథ్యంలో, పాక్ తన ఆశలను చైనా తయారీ J-10C ఫైటర్లపై పెట్టింది.ఇవి “విగోరస్ డ్రాగన్” అని పిలవబడతాయి.ఈ జెట్లు చైనాలో అత్యాధునికంగా రూపొందించబడ్డాయి. వీటిలో PL-15 లాంగ్-రేంజ్ క్షిపణులు ఉంటాయి. వీటివల్ల గాలిలో దూరం నుంచే శత్రువుని ఉద్దేశించి క్షిపణులు వదిలేయవచ్చు.పాక్ ఈ J-10Cలను భారత Rafale జెట్లకు ప్రత్యామ్నాయంగా చూస్తోంది. కానీ సామర్థ్యంలో Rafale మరింత ఆధునికమైనదే.

ప్రస్తుతం పాక్ వద్ద 30కు చేరువలో J-10C జెట్లు ఉన్నాయి.వాటితో పాటు JF-17 బ్లాక్ III ఫైటర్లు కూడా వినియోగంలో ఉన్నాయి.సంఖ్యల్లోనూ, నాణ్యతలోనూ భారత్ వాయుసేన దృష్టినిర్దేశకంగా ఉంది. Rafale, Su-30 వంటి ఫైటర్లు పాక్ వాయుసేనను మించిపోయే శక్తిని కలిగివున్నాయి. ఇక అమెరికా ఆంక్షలతో F-16లు పూర్తి సామర్థ్యంతో ఉపయోగించలేని పరిస్థితి పాక్‌ను మరింత బలహీనంగా చేస్తోంది.చైనా జెట్లు గట్టిగా కనిపించవచ్చు. కానీ వాటి నమ్మకద్రోహ చరిత్రను మర్చిపోకూడదు. సాంకేతికంగా భారత్ ముందుంది. యుద్ధానికి వెళితే, గాలిలో ఆధిపత్యం భారత్‌దే అన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

Read Also : Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870