Pakistan, China colluding against India.. Army Chief

భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా కుమ్మక్కు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని భారత్‌ తప్పక అంగీకరించాలన్నారు. ఈ మేరకు ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. రెండు వైపుల నుంచి దేశానికి ముప్పు పొంచి ఉందన్నారు. సైనిక సన్నద్ధత, సరిహద్దుల వెంబడి పరిస్థితులు, బంగ్లాదేశ్‌ అంశం తదితరాల గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

Advertisements
భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా

సన్నిహిత సంబంధాలు మనకు ఆందోళనకరం

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదానికి ఆ దేశం (పాక్‌) కేంద్రబిందువు. అందువల్ల మనకు పొరుగునున్న ఏ దేశంతోనైనా ఆ దేశం సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం మనకు ఆందోళనకరం. ఇందుకు కారణం.. ఆ దేశాన్ని కూడా ఉగ్రవాద చర్యలను ఉపయోగించుకునే అవకాశం ఉండటమే అని ద్వివేది పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందన్నారు.

మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం

అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య సైనిక బంధం బలంగానే ఉందని చెప్పారు. చైనా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక బంధం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వర్చువల్‌ వేదికలపై ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారైన సైనిక ఉత్పత్తులను పాక్‌ వినియోగిస్తోంది. కుమ్మక్కుకు సంబంధించి నేడున్న పరిస్థితి ఇది. దీన్నిబట్టి రెండువైపుల నుంచి ఏకకాలంలో మనకు యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం అని ఆర్మీ చీఫ్‌ పేర్కొన్నారు.

Related Posts
Golden temple: స్వర్ణదేవాలయంలో దాడి..ఐదుగురికి గాయాలు
Golden temple: స్వర్ణదేవాలయంలో దాడి..ఐదుగురికి గాయాలు

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద జరిగిన దాడి తీవ్ర కలకలం రేపింది. భక్తులు, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఓ దుండగుడు Read more

TDP : రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్ధతు
TDP రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్ధతు

TDP : రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్ధతు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టమైన వైఖరి Read more

సరిహద్దు భద్రతపై కెనడా కీలక నిర్ణయాలు..
Canada Prime Minister

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కెనడా తన సరిహద్దుల భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ట్రంప్, కెనడా పట్ల తన వాణిజ్య Read more

Fire Accident : హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం
1200 675 23186355 thumbnail 16x9 hydra ranganath

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతున్న నేపథ్యంలో, హైడ్రా మరియు జీహెచ్ఎంసీ కమిషనర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్నిప్రమాదాలను సమర్థవంతంగా నివారించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Read more

×