ఇటీవల కొన్ని సంఘటనలు వింటే నమ్మకం కలగడం లేదు. సంబంధాల మీద నమ్మకాన్ని నాశనం చేసే విధంగా, నిత్య జీవితాల్లో అతి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కూతురికి కాబోయే భర్తతో తల్లులు పారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తుంటే, మరోవైపు పెళ్లి పేరుతో మోసాలు జరుగుతున్నాయ్. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఓ భర్త, చివరికి ఊహించని నిజాన్ని తెలుసుకొని షాక్ తిన్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..
షకీర్, అంజుమ్‌ల ప్రేమకథ చివరికి ఇలా ముగిసిందా?
అలీఘర్‌లో నివసించే షకీర్ అనే యువకుడి వివాహం కొన్నేళ్ల క్రితం అంజుమ్ అనే యువతితో జరిగింది. వీరి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతోందని అందరూ అనుకున్నారు. వీరికి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యుని పెళ్లి కోసం షకీర్ తాత్కాలికంగా తన గ్రామం వదిలి, వేరే ఊరికి వెళ్లాడు. పెళ్లి కార్యక్రమాలు ముగించుకుని ఏప్రిల్ 15న తిరిగి ఇంటికి వచ్చిన షకీర్, ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇంటి తలుపు మూసి ఉండటమే కాకుండా, భార్య అంజుమ్, పిల్లలు ఎక్కడా కనిపించలేదు. వెంటనే గావరపడి అతను స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
నిజం తెలుసుకున్న భర్తకు షాక్
పోలీసులు కేసు నమోదు చేసి, అన్వేషణ ప్రారంభించారు. మొదట మిస్సింగ్ కేసుగా తీసుకుని, అంజుమ్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో షకీర్‌కు ఒక షాక్ తగిలింది. తన భార్య తప్పిపోలేదని, మరో వ్యక్తితో కలిసి పారిపోయిందని సమాచారం లభించింది. అంతే కాదు, ఆమె ప్రస్తుతం ఢిల్లీలోని తాజ్ మహాల్ వద్ద కొత్త జీవితాన్ని ఆనందించుతోందన్న విషయమూ తెలుస్తుంది. భార్య పిల్లలతో సహా ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుని, తనను వదిలేసిందని గ్రహించిన షకీర్ మిక్కిలి బాధకు గురయ్యాడు.
పోలీసులు తీసుకున్న చర్యలు
ఈ విషయం వెలుగులోకి వచ్చాక, అలీఘర్ పోలీసులు వెంటనే ఆగ్రా పోలీసులతో సంప్రదించి, అనుమానితులను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. భార్య పిల్లలను వెనక్కి తీసుకురావడం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. షకీర్ మాత్రం తన భార్య చేసిన మోసం కారణంగా మానసికంగా ఎంతగానో కుంగిపోయాడు. పెళ్లి సంబంధాలపై తన నమ్మకం పూర్తిగా నశించిపోయిందని బాధతో చెబుతున్నాడు. ఇక అంజుమ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
READ ALSO: Ex-Karnataka Police Chief : భార్యే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం