हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Uttar Pradesh: పెట్రోల్ బంక్‌లో ఓ సిబ్బంది పై గన్ తో బెదిరించిన యువతీ

Ramya
Uttar Pradesh: పెట్రోల్ బంక్‌లో ఓ సిబ్బంది పై గన్ తో బెదిరించిన యువతీ

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని హర్దోయ్‌లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం (జూన్ 15) ఒక కుటుంబం గ్యాస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా కారులోని వారిని కిందికి దిగమని అడగటం, అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. అయితే, ఈ గొడవ మరింత ముదిరి, చివరకు కారులో ఉన్న ఓ యువతి హ్యాండ్‌బ్యాగ్ నుండి తుపాకీ (Gun) తీసి, పెట్రోల్ బంక్ సిబ్బంది ఛాతీపై గురిపెట్టి బెదిరించింది. ఈ దృశ్యాలు గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హర్దోయ్‌లో షాకింగ్ ఘటన: తుపాకీతో బెదిరింపులు

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని హర్దోయ్‌లో ఆదివారం (జూన్ 15) సాయంత్రం ఒక సీఎన్‌జీ పెట్రోల్ బంక్‌కి (CNG petrol station) ఎహ్సాన్ ఖాన్ (Ehsaan Khan) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చారు. ఆయిల్ ఫిల్ చేస్తున్న రజనీష్ కుమార్ (Rajneesh Kumar) అనే వర్కర్, భద్రత దృష్ట్యా కారులో ఉన్న వారిని బయటకు రావాలని సూచించాడు. అయితే, కారు దిగడానికి నిరాకరించిన ఎహ్సాన్ ఖాన్, రజనీష్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో రజనీష్ కాస్త దురుసుగా ప్రవర్తించడంతో, అదే కారులో ఉన్న ఎహ్సాన్ ఖాన్ కూతురు అరిబాకు పట్టరాని కోపం వచ్చింది.

కోపంతో కారు దిగిన అరిబా, తన హ్యాండ్‌బ్యాగ్ నుంచి ఒక రివాల్వర్‌ను తీసి, నేరుగా రజనీష్ (Rajaneesh Kumar) కుమార్ ఛాతీపై గురి పెట్టింది. “ఇట్నీ గోలియాన్ మారుగి కి ఘర్ వాలే పెహ్చాన్ నహీ పాయేగే” (నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా బుల్లెట్లతో కాల్చిపారేస్తా) అంటూ బెదిరించింది. ఈ ఘటనతో బంకులోని ఇతర సిబ్బంది భయపడి జోక్యం చేసుకోగా, పరిస్థితి సర్దుమనిగింది. అరిబా తల్లి ఆమెను తిరిగి కారులోకి తీసుకువెళ్లింది. అనంతరం ఆ కుటుంబం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సీసీటీవీ ఫుటేజ్, పోలీసుల చర్యలు

ఈ ఘటనపై గ్యాస్ స్టేషన్ సిబ్బంది, రజనీష్ కుమార్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, రజనీష్ కుమార్ ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఎహ్సాన్ ఖాన్ పేరుతో రిజిస్టర్ అయిన రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన భద్రతా నిబంధనలను పాటించకపోవడం, చిన్న విషయాలకే కోపంతో ఆయుధాలు ప్రయోగించడం వంటి వాటిపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆయుధ సంస్కృతి ప్రమాదకరంగా మారుతున్న తీరును స్పష్టం చేస్తున్నాయి.

Read also: Air India Plane Crash: మృతుల గుర్తింపులో డీఎన్‌ఏ పరీక్షలే ఆధారం!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం

ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

బర్త్ డే అని చెప్పి.. ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్ రేప్..

బర్త్ డే అని చెప్పి.. ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్ రేప్..

వివాహితపై కన్నేసి.. తిరస్కరించిందన్న కోపంతో కాల్పులు

వివాహితపై కన్నేసి.. తిరస్కరించిందన్న కోపంతో కాల్పులు

పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

పెళ్లైన వ్యక్తితో బాలిక ప్రేమ.. పరువు కోసం హతమార్చిన తల్లిదండ్రులు

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు: ఏడుగురి మృతి

ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

ఆన్‌లైన్ మోసానికి గురైన సంగీత దర్శకుడు

భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

భార్యపై అనుమానంతో భర్త హత్య, మృతదేహం ఇంట్లో దాచిన ఘటన

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

📢 For Advertisement Booking: 98481 12870