Udhayanidhi Stalin : తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, నటి త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో డీఎంకే (DMK) కీలక నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం ఉదయం ఆకస్మికంగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం తమిళనాట పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అరెస్ట్ వార్త తెలియగానే డీఎంకే వర్గాలు, ఉదయనిధి మద్దతుదారులు తీవ్ర నిరసనలు వ్యక్తంచేస్తూ రోడ్లపైకి వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Read Also : ఎమ్మెల్యేలకు డీకే వార్నింగ్

హైకోర్టును ఆశ్రయించిన ఉదయనిధి – స్టేషన్ బెయిల్‌తో విడుదల
పోలీసుల చర్యను సవాలు చేస్తూ ఉదయనిధి స్టాలిన్ న్యాయవాదులు తక్షణమే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో సుమారు గంటన్నర పాటు విచారణ ఎదుర్కొన్న ఉదయనిధి, బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో బయటకు వచ్చారు. పోలీస్ స్టేషన్ వెలుపల అప్పటికే వేలాదిగా చేరుకున్న డీఎంకే శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. తన మద్దతుదారులకు, కార్యకర్తలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ఉదయనిధి అక్కడి నుంచి ముందుకు సాగారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :