ఢిల్లీ పెద్దల సభలోకి టీవీకే ఎంట్రీకి రంగం సిద్ధం
TVK Vijay : దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళనాడులో సంచలన విజయంతో అధికారంలోకి వచ్చిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండటం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
రాజ్యసభ ఎన్నికలతో మారనున్న రాజకీయ సమీకరణాలు
ఈ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. అధికార ఎన్డీయే కూటమి ప్రస్తుతం ఉన్న బలం కంటే ఒక స్థానం తగ్గే అవకాశముండగా, కాంగ్రెస్ తన స్థానాలను పెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తనకు ఉన్న మూడు స్థానాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జార్ఖాండ్‌లో జేఎంఎం బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడులో టీవీకే సరికొత్త రాజకీయ అడుగు
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే సంచలనం సృష్టించిన విజయ్ పార్టీ ఇప్పుడు కేంద్ర రాజకీయాలపై దృష్టి పెట్టింది. తమిళనాడు నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాన్ని టీవీకే దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో టీవీకే తొలిసారి పార్లమెంట్ పెద్దల సభలో ప్రాతినిధ్యం పొందే అవకాశం ఏర్పడింది.
Read also : Modi Rojgar Mela 2026: 51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ పత్రాలు అందజేసిన ప్రధాని మోదీ!

ఏపీలో టీడీపీ ఆధిక్యం.. వైసీపీకి భారీ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలన్నీ అధికార తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం మూడు స్థానాలు కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది కీలక మార్పుగా భావిస్తున్నారు.
కేంద్ర మంత్రులకు కీలక పరీక్ష
ఈ రాజ్యసభ ఎన్నికలు బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రులు రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్‌లను గెలిపించుకోవడం పార్టీకి కీలకంగా మారింది. పంజాబ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రవ్నీత్ సింగ్ బిట్టును రాజ్యసభకు పంపాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :