हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Assam Floods: ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ హామీ

Vanipushpa
Assam Floods: ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ హామీ

ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) దృష్టి పెట్టారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్, మణిపుర్‌ గవర్నర్‌ అజయ్‌భల్లాలకు(Assam, Sikkim, Manipur) ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి 40 మంది చనిపోగా, దాదాపు 6 లక్షల మందికిపైగా ప్రజలు తీవ్ర ఇ‌బ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ హామీ
ఈశాన్య రాష్ట్రాల వరదలపై ప్రధాని మోదీ హామీ

అసోంలో వరద బీభత్సం
నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు. అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం-ఐఎండీ హెచ్చరించింది. ఇప్పటికే వరద 22 జిల్లాలకు విస్తరించింది. దీనితో దాదాపు 5.3 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. ఇప్పటి వరకూ ఆ రాష్ట్రంలో 11 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1,254 గ్రామాలు నీటమునిగినట్లు అధికారులు తెలిపారు. శ్రీభూమి జిల్లాలో అత్యంత దారుణంగా పరిస్థితులు ఉన్నట్లు వివరించారు. 165 వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన అసోం ప్రభుత్వం 31,212 మందిని తరలించింది. మరో 157 కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేస్తోంది. బ్రహ్మపుత్ర, బరక్‌, కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సుబన్‌సిరి, బుర్హిదిహింగ్‌, ధన్‌సిరి, రుక్ని, ధలేశ్వరి, కటాఖల్, ఖుషియారా నదులు ప్రమాదకర స్థాయిని తాకుతూ ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి.
విరిగిపడుతున్న కొండ చెరియలు
మణిపూర్‌లో వరద ఉద్ధృతి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇంఫాల్‌ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టడంలేదు. ఇళ్లన్నీ నీటమునిగి ఉన్న నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా 47 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి.
190కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి
మిజోరాం వ్యాప్తంగా వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాల్లో ఇంకా కొండచరియలు విరిగిపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు 190 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. 190కిపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్‌ ఎక్కువ ప్రభావితమైంది. మంగళవారం ఉదయం కూడా జోరు వాన కురిసి అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐజ్వాల్‌లో వరుసగా నాలుగో రోజూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
వర్షం కారణంగా సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఎంఐ-17 హెలికాఫ్టర్ల ద్వారా 34 మందిని పాంగ్‌యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది.

Read Also: Chenab Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌ను జూన్ 6న

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870