ISRO GSLV-F17 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోట నుంచి చేపట్టిన GSLV-F17 ప్రయోగం ఘన విజయాన్ని సాధించింది. నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్, నిర్ణీత మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుని ‘EOS-05’ శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి అత్యంత ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టింది. రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా పూర్తి కావడంతో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ సంతోషం వ్యక్తం చేస్తూ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. అనంతరం ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. అంతరిక్ష సాంకేతికతలో భారత్ సాధిస్తున్న నిరంతర పురోగతికి ఈ ప్రయోగ విజయం మరో నిదర్శనంగా నిలిచింది.
Read Also : సీజేపీలో చీలిక?.. ‘టీమ్ కేజ్రీవాల్’ పేరుతో రెబల్ నేత కొత్త పార్టీ!

సరిహద్దుల్లో మూడో కన్ను: దేశ రక్షణ, విపత్తుల పసిగట్టడంలో కీలకం!
ఈ ప్రయోగం ద్వారా కక్ష్యలోకి చేరుకున్న EOS-05 ఉపగ్రహం భూమి నుంచి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ అత్యంత కీలకమైన సేవలను అందించనుంది. ముఖ్యంగా భారత సరిహద్దు ప్రాంతాల్లో శత్రుదేశాల కదలికలను నిరంతరం పసిగడుతూ, భూభాగాలను నిశితంగా పర్యవేక్షించడంలో ఈ ఉపగ్రహం రక్షణ వ్యవస్థలకు ప్రధాన బాసటగా నిలవనుంది. దేశ రక్షణ రంగంతో పాటు ముందస్తు విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులను అంచనా వేయడంలో కూడా ఈ ఉపగ్రహం పంపే సమాచారం ఎంతో కీలకం కానుంది. అధునాతన పేలోడ్స్‌తో రూపుదిద్దుకున్న ఈ ఆర్బిటర్ సమాచార సేకరణలో విప్లవాత్మక మార్పులు తేనుందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :