📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు బచ్చలి కూరలో బోలెడన్ని విటమిన్లు

Heat Wave: దేశంలో పెరుగుతున్న వేడి గాలులు..రాష్ట్రాలకు హెచ్చరికలు

Author Icon By Vanipushpa
Updated: April 22, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఇందులో దక్షిణ ఉత్తర్​ప్రదేశ్, మధ్యప్రదేశ్, హరియాణా, విదర్భ ప్రాంతాలు ఉన్నాయి. వీటికి ఏప్రిల్ 25 వరకు యెల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం
గుజరాత్​, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని IMD తెలిపింది. ఏప్రిల్ 25 వరకు వేడి, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వివరించింది. అయితే, ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మణిపుర్, మేఘాలయ్, నాగాలాండ్, త్రిపుర, మిజోరంలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.

సాధారణానికి మించి వర్షాలు
మరోవైపు ఇటీవలె వ్యవసాయ రంగానికి తీపి కబురు చెప్పింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ). ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో (జూన్‌-సెప్టెంబరు) దేశ వ్యాప్తంగా సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొందిత. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి వానలు పడే అవకాశం ఉందని ప్రటించింది. 1971 నుంచి 2020 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా దీర్ఘకాలంలో సగటున 87 సెంటీమీటర్ల వర్షం కురుస్తోందని, ఇప్పుడు అందులో 105% దాకా వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు తక్కువ
అలాగే సాధారణానికి మించి, అధిక వర్షపాత అంచనాలను కలిపి చూస్తే 56% మంచి వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. అలానే ఈ ఏడాదిలో ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు లేవని వివరించింది. డిసెంబరు-మార్చి మధ్య హిమాలయాలు, యూరో ఏసియా ప్రాంతంలో మంచు తక్కువగా ఉందని, ఇవన్నీ మంచి వర్షాలు కురవడానికి శుభపరిణామాలని IMD పేర్కొంది.

Read Also: Pope Francis : కొత్త పోప్ ఎన్నిక కోసం కీలకమైన ప్రక్రియ

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Hot winds increasing in the country. Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today warnings to states

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.