భారతదేశంలో రైళ్లు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ విధానంగా ఉంది. రైల్వే ద్వాారా లక్షలాది మంది ప్రయాణికులు రోజూ ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచడానికి అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. ముఖ్యంగా వివిధ యాప్స్ ద్వారా పొందే రైల్వే సేవలన్నింటినీ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. స్వరైల్ పేరుతో ఓ ప్రత్యేక సూపర్ యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ యాప్ రైల్వే సంబంధిత అన్ని సేవలకు వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్వరైల్ సూపర్ యాప్ వివిధ రైల్వే సేవలను ఏకీకృతం చేస్తుంది.

స్వరైల్ యాప్: అన్ని రైలు సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో పొందవచ్చు
భారతీయ రైల్వేలకు సంబంధించిన స్వరైల్ యాప్ అనేక రైల్వే అప్లికేషన్లను ఏకీకృతం చేయడం ద్వారా ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ – టికెట్ బుకింగ్‌లు, రిజర్వేషన్‌ల సౌకర్యం అందిస్తుంది. రైల్ మదద్ ఫిర్యాదు పరిష్కారం, ఆన్‌బోర్డ్ సహాయాలను, నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ రియల్ టైమ్ రైలు ట్రాకింగ్, స్టేటస్ అప్‌డేట్స్ అందిస్తుంది. అలాగే యూటీఎస్ యాప్ రిజర్వ్డ్ కాని టికెట్ కొనుగోలు చేసేందకు ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ రైలులో ఆహారాన్ని అందించే సదుపాయాన్ని అందిస్తుంది. అయితే ఈ సేవలన్నింటినీ ఒకే యాప్ కిందకు తీసుకురావడం ద్వారా ప్రయాణీకులు బహుళ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో స్వరైల్ యాప్ రైల్వే చరిత్రలో గేమ్ చేంజర్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ యాప్ ట్రయల్ వెర్షన్ కొందరిక అందుబాటులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు. త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది.
స్వరైల్ యాప్ యొక్క ప్రధాన లక్ష్యాలు
స్వరైల్ యాప్ ప్రధానంగా ఈ క్రింది సేవలను అందించడానికి లక్ష్యంగా రూపొందించబడింది:
టికెట్ బుకింగ్: ప్రయాణికులు సులభంగా తమ రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
రైలు ట్రాకింగ్: యాప్‌లో రైలు స్టేటస్ ను రియల్ టైంలో ట్రాక్ చేయవచ్చు.
ఆహారం ఆర్డర్ చేయడం: ప్రయాణికులు రైల్లో ఆహారం ఆర్డర్ చేయవచ్చు.
నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ: ప్రయాణీకులు రైలు సమయాలు, గమ్యస్థానాలు, వాయిదాలు వంటి వివరాలను పొందవచ్చు.
ఇతర సేవలు: రైలు రన్నింగ్ స్టేటస్, పోర్టల్ ద్వారా ఫిర్యాదులు పరిష్కరించబడతాయి.
ఈ యాప్ ద్వారా అన్ని రైల్వే సేవలు సులభంగా పొందవచ్చు, అందువల్ల ప్రయాణికులు అనేక యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవశ్యకత లేకుండా ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని సేవలను పొందవచ్చు.
స్వరైల్ యాప్ ద్వారా ప్రయాణికులకు ఎదురయ్యే లాభాలు
సులభతరం చేసిన టికెట్ బుకింగ్: ప్రయాణికులు ఏనాడు, ఎప్పుడు తమ టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.
అన్ని సేవలు ఒకే యాప్‌లో: రైలు ట్రాకింగ్, ఆహారం ఆర్డర్ చేయడం, పోర్టల్ ద్వారా ఫిర్యాదులు పరిష్కరించడం మొదలైన సేవలు ఒకే యాప్‌లో అందుబాటులో.
సమయాన్ని ఆదా చేయడం: ప్రయాణీకులు అనేక యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్ ద్వారా అన్ని సేవలను పొందగలుగుతారు.
ఆధునిక సాంకేతికత: స్వరైల్ యాప్‌లో ఉపయోగించే డిజిటల్ టెక్నాలజీ ప్రయాణీకుల అనుభవాన్ని సులభతరం చేస్తుంది.