Fees embezzlement: ఫీజుల దోపిడీకి కళ్లెం ఇంకెప్పుడు?

Follow Us: Google News Daily Hunt
Fees embezzlement
Fees embezzlement
FONT SIZE
GET APP

Fees embezzlement: భారతదేశంలోని ప్రధాన నగరా లైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ మాత్రమే కాదు పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజులు తల్లిదండ్రులకు షాక్కు గురిచేస్తున్నాయి. అగ్రశ్రేణి స్కూళ్లని చెప్పుకునే కొన్ని విద్యాసం స్థలు విద్యార్థుల నుంచి ఏడాదికి లక్షలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా యి. ఈ భారీ ఫీజులను చూసి తల్లి దండ్రులు, మేధావులు, విద్యావేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ఐవీ లీగ్అండర్గ్రాడ్యుయేట్ ట్యూషన్ ఫీజులు లేదా యూరప్లోని ఇంటర్నేషనల్ బోర్డిం గ్ స్కూళ్ల ఫీజులకు సమానంగా ఇక్కడ ఫీజులు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భారతదేశంలో విద్య క్రమంగా వ్యాపార వస్తువుగా మారిపోతోంది. కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నా యి. పలు బడా ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల భారం తల్లి దండ్రుల నడ్డి విరుస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ వార్షిక ఆదాయానికి మించి పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తున్నారు.

Read Also: Student Aadhaar Camps: విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌కు స్పెషల్ క్యాంపులు

Fees embezzlement
Fees embezzlement

Fees embezzlement: విద్యను వ్యాపారంగా

ప్రపంచంలోని సింగపూర్, దుబాయ్, న్యూ యార్క్ వంటి నగరాల్లో ఉన్న స్కూల్ ఫీజులతో సమా నంగా భారత దేశంలో ఫీజులు వసూలు చేస్తున్నా అందుకు తగ్గట్టుగా భారతీయ తల్లిదండ్రుల ఆదాయాలు మాత్రం లేవు. అంతేగాక, లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్న పిల్లలకుఅందుకు తగిన విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలపై కఠిన నియంత్రణ ఉండాలని విద్యావేత్తలు, నిపుణులు సూచిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ఫీజులు భరించే ఆర్థిక స్తోమత భారతీయ కుటుంబాలకు లేకపోయి నా ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వారిని ఆ దిశగా నెట్టేస్తోంది. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ శక్తులు, వాటిని నియంత్రించడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ వార్షిక ఆదాయంలో 50శాతం నుంచి 130 శాతం వరకు పిల్లల స్కూల్ విద్య కోసం ఖర్చు చేస్తున్నారనే అధ్యయనాలు వెల్ల డిస్తున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో వార్షిక ఆదాయం కంటే ఎక్కువ మొత్తాన్ని విద్య కోసం వెచ్చించాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది.

బోధనా విధానాలు పూర్తివిరుద్ధం

మన దేశంలో అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో భారీ ఫీజులు వసూలు చేస్తున్న అనేక స్కూళ్లలో మౌలిక వసతులు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఒక తరగతి గదిలో సగటున ౩౫ నుంచి 40 మంది విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. స్విమ్మింగ్ పూల్స్, ల్యాబ్ లు, ఆడిటోరియంలు ఉన్నప్పటికీ వాటిని పరిమితికి మించి విద్యార్థులు వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ ప్రమాణాల విద్య అని ప్రచారం చేస్తున్నా.. ఉపాధ్యాయుల శిక్షణ, బోధనా విధానాలు అందుకు పూర్తివిరుద్ధంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విదేశాల్లోని అనేక ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఒక తరగతి గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే ఉం టారు. ఫీజులకు తగినట్టుగా సదుపాయాలు, వ్యక్తిగత శ్రద్ధ, నాణ్యమైన విద్య అక్కడ విద్యార్థులకు అందుతుంది. రాష్ట్రం లోనూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజు లను పెంచకుండా నియంత్రిస్తామనే మాటలు సంవత్సరాలు గా వినిపిస్తున్నా అవి ఆచరణలోకి రావడం లేదు. మరో విద్యాసంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న ప్పటికీ, ఫీజుల నియంత్రణపై స్పష్టమైన చర్యలు కనిపించకపోవడంతో తల్లిదండ్రుల గుండెల్లో ఆందోళన పెరుగుతోంది.

నియంత్రణ లేకపోవడం

గత కొన్నేళ్లుగా ఫీజుల నియంత్రణ కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా చట్టపరమైన చర్యల విషయంలో మాత్రం చిత్తశుద్ధి కనిపిం చడం లేదు. దేశంలోని అనేక నగరాలతో పోలిస్తే హైదరా బాద్లోనే స్కూల్ ఫీజులు అధికంగా ఉన్నాయని కొన్నిఅధ్య యనాలు పేరొ్కంటున్నాయి. రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఇంజినీరింగ్ విద్యకు సమానంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నియంత్రణ లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రతి ఏడాది 20నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శ లు వినిపిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని హై కోర్టులో అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యా హక్కు చట్టం-2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం అన్ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 25శాతం సీట్లను బలహీన వర్గాలు, అనాథ లు, ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. ఇందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వంతిరిగి చెల్లించవచ్చు.

Fees embezzlement
Fees embezzlement

చైతన్య పోరాటం రావాలి

దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ నిబంధనను అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం సవరణల పేరుతో అమలు నిర్లక్ష్యానికి గురువుతోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమిష్టి బాధ్యతగా రాజ్యాం గంలో పొందుపరిచాయి. ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యఅందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ విద్యా రంగంపై నియంత్రణ కోల్పోయిన పాలకులు దానిని కార్పొ రేట్ శక్తుల చేతుల్లో వ్యాపార వస్తువుగా మారనిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉచిత పథకాలపై చూపుతున్న శ్రద్ధ విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలపై కనిపించ డం లేదు. ఉచిత,నాణ్యమైన విద్య కోసం ప్రజల్లో మరో చైతన్య పోరాటం రావాల్సిన అవసరం ఉంది. విద్యారంగం లోని ఈ వ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు అడ్డుకట్ట వేయా లంటే ప్రభుత్వాలే పూర్తి బాధ్యత తీసుకోవాలి. విద్యను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడే ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధ్యమవుతుంది. అదే నిజమైన ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.


-మేకిరి దామోదర్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు