దేశంలో మళ్లీ కరోనా కేసుల వ్యాప్తి పెరుగుతుండటం ఇప్పుడు తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయి. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆస్పత్రులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా జేఎన్ 1 వేరియంట్(JN1 variant) ఈ కేసుల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 3 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 23 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్‌లు, వ్యాక్సిన్ల లభ్యతను నిర్ధారించాలని ఆస్పత్రులను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఈ వేరియంట్ సాధారణ ఇన్‌ఫ్లుయెంజా లాంటిదేనని భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రి పంకజ్ సింగ్ తెలిపారు.
అధికారులను
కేరళలో ఒక్క మే నెలలోనే 273 కొవిడ్ కేసులతో దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచింది. దీంతో వైరస్‌పై నిఘా పెంచాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. ఆస్పత్రులలో మాస్క్‌లు తప్పనిసరి చేసింది. మహారాష్ట్రలో ఒక్క మే నెలలోనే 95 కేసులు నమోదయ్యాయని,అయితే ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగా ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ(State Health Department) వర్గాలు వెల్లడించాయి. లక్షణాలు ఉన్న రోగులందరూ కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది.కర్ణాటకలో ఇటీవల 35 కొత్త కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 9 నెలల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ నెలలో కొత్త కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు
జేఎన్ 1 వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగా ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన తర్వాత 4 రోజులలోపు బాధితులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు కొవిడ్ వైరస్ సోకి ఎవరూ చనిపోలేదని పేర్కొన్నారు. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట, నీరసం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తున్నాయని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఈ జేఎన్ 1 వేరియంట్‌ను ఆందోళన కలిగించే వేరియంట్‌గా గుర్తించలేదు.
Read Also : Business flight: ఇక నుండి బిజినెస్ ఫ్లైట్ కిటికీలు మూసిఉంచాలి: కొత్త రూల్స్