Brics Summit 2026 : బ్రిక్స్ సమ్మిట్ వచ్చిన దేశాధినేతల అనారోగ్యంతో బాధపడుతున్నారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Follow Us: Google News Daily Hunt
india brics summit success
india brics summit success
FONT SIZE
GET APP

Brics Summit 2026 : భారత్‌లో ఇటీవల జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు హాజరై తిరుగు ప్రయాణమైన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాల ఆరోగ్యం క్షీణించిందంటూ సామాజిక మాధ్యమాల్లో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. వారు భారత్ నుంచి వెళ్లినప్పటి నుంచి బహిరంగంగా కనిపించకపోవడం, అలాగే కొన్ని అధికారిక కార్యక్రమాలు సైతం రద్దయ్యాయంటూ వస్తున్న వార్తలు నెటిజన్లలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఈ పుకార్లు, భిన్న ప్రచారాల నేపథ్యంతో అంతర్జాతీయంగా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also : బాబాయ్ ఇవేం ఎండలు ..ఉక్కపోతతో అల్లాడుతున్న జనం

ఆ ప్రచారంలో నిజం లేదు: విదేశాంగ శాఖ (MEA) స్పష్టత

ఈ వైరల్ వార్తలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందిస్తూ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. విదేశీ నేతల ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారాలేనని, వాటిలో ఎలాంటి నిజం లేదని ఖండించింది. విదేశాంగ శాఖ అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం (MEA Fact Check) ద్వారా దీనిపై క్లారిటీ ఇస్తూ… సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారమవుతున్న ఇటువంటి పోస్టులను, వదంతులను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. దృవీకరించని సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు ప్రజలు, మీడియా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు