हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఇక సులభంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్

Vanipushpa
ఇక సులభంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్

మన దేశంలో ప్రతిరోజూ ఎంతో మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణీకులకు టికెట్ బుకింగ్ ఈజీ చేయడానికి IRCTC ఒక కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. దీని పేరు వర్చువల్ వాయిస్ అసిస్టెంట్ AskDisha 2.0. ఇది ఒక AI-ఆధారిత సర్వీస్, గంటల తరబడి క్యూలలో నిలబడకుండా జస్ట్ టైప్ చేయడం లేదా మాట్లాడటం ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు ప్రయాణీకులు ఈ చాట్‌బాట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు, రైలు స్టేటస్ చెక్ చేయవచ్చు, ఇంకా టూర్ ప్యాకేజెస్ చూడవచ్చు. అయితే దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసా?
IRCTC ప్రత్యేకత ఏంటి

ఇక సులభంగా ట్రైన్ టికెట్స్ బుకింగ్

AskDisha 2.0 అనేది IRCTC సృష్టించిన AI అసిస్టెంట్. ఇది వాయిస్, టెక్స్ట్ లేదా వాయిస్ మెసేజెస్ ద్వారా పని చేస్తుంది. దీని సహాయంతో మాట్లాడుతూ రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు మాట్లాడటం ద్వారా మీకు కావలసిన సిట్ సహా ప్రయాణించాల్సిన రైలు టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఒక OTP అవసరం అవుతుంది. దీనిని ఎండ్-టు-ఎండ్ టికెట్ బుకింగ్, క్యాన్సల్, PNR స్టేటస్, రిఫండ్ ట్రాకింగ్ కోసం ఉపయోగించవచ్చు.

టికెట్ ఎలా బుక్ చేయవచ్చు
టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ ఓపెన్ చేయండి. మీరు AskDisha అప్షన్ ఇక్కడ చూస్తారు. మీరు IRCTC xఅకౌంట్ లేదా WhatsApp ద్వారా కూడా AskDishaకి కనెక్ట్ కావచ్చు. ఈ టూల్‌కి వెళ్ళిన తర్వాత ముందుగా హలో లేదా టికెట్ బుక్ వంటి పదాలు చెప్పండి. ఇది విన్న తర్వాత మీకు టికెట్‌కు సంబంధించిన సమాచారం అవసరమని AskDisha అర్థం చేసుకుంటుంది. అప్పుడు చాట్‌బాట్ బుకింగ్ వివరాలను అడుగుతుంది. తరువాత మీరు ఏ స్టేషన్ నుండి, మీరు ఎక్కడి వరకు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతుంది. ప్రయాణ తేదీ, మీరు ప్రయాణించాలనుకుంటున్న క్లాస్, స్లీపర్, 3AC, 2AC, ఫస్ట్ క్లాస్ వంటి పూర్తి వివరాలు చెప్పాలి.

సమాచాచారం స్పష్టమైన పదాలలో ఉండాలి

అయితే మీ ఇచ్చే సమాచాచారం స్పష్టమైన పదాలలో అర్ధం కావాలి. దీని తరువాత సమాచారం ఆధారంగా చాట్‌బాట్ మీకు రైళ్ల లిస్ట్ చూపుతుంది, ఇంకా రైళ్ల సమయం, సీట్ల గురించి కూడా మీకు సమాచారం ఇస్తుంది. ఇక్కడ మీరు మీకు నచ్చిన రైలు, క్లాస్, సీటును సెలెక్ట్ చేసుకోవచ్చు. రైలు, సీటును సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాట్‌బాట్ మీ వివరాలను వెరిఫై చేస్తుంది తరువాత టికెట్ బుక్ చేసుకోవడానికి పేమెంట్ అప్షన్ అడుగుతుంది. పేమెంట్ చేయడానికి UPI, క్రెడిట్-డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి చాల అప్షన్స్ కనిపిస్తాయాయి. మీరు ఏ ఆప్షన్ నుండి పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసి పేమెంట్ చేయండి. దీని తర్వాత మీకు బుకింగ్ కన్ఫర్మేషన్, PNR నంబర్ వస్తుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఇమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్‌కు ఇ-టికెట్ వస్తుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870