📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Akshay kumar: రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన నటుడు అక్షయ్ కుమార్..కోట్లలో ఆదాయం

Author Icon By Vanipushpa
Updated: April 24, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తిగా మారుతున్నాడు. తాజాగా అతను రెండు అపార్ట్‌మెంట్‌లను అమ్మడం ద్వారా జాక్ పాట్ కొట్టాడు. అయితే ఈ ఆఫీస్ స్థలాన్ని రూ.8 కోట్లకు అమ్మేశాడు. అక్షయ్ కుమార్ ముంబైలోని లోయర్ పరేల్‌లో ఉన్న ఈ ఆఫీస్ స్థలాన్ని గతంలో అమ్మకానికి పెట్టాడు. ఈ ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లను స్క్వేర్ యార్డ్స్ అనే ప్రాపర్టీ వెబ్‌సైట్ అందించింది. ఈ నెల ఏప్రిల్ 2025లో డీల్ పూర్తి కాగా, ఈ ఆఫీస్ స్థలాన్ని విపుల్ రమేష్ మెహతా అండ్ కాశ్మీరా విపుల్ మెహతాకు విక్రయించారు. ఈ ఆఫీసుతో పాటు అతనికి రెండు కార్ల పార్కింగ్ స్థలం కూడా ఉంది. అంతకుముందు మార్చి 2025లో అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివలిలో రెండు అపార్ట్‌మెంట్‌లను అమ్మడం ద్వారా రూ. 6.6 కోట్లు సంపాదించాడు. వీటిలో ఒకటి రూ.5.35 కోట్లకు అమ్ముడవగా, రెండవది రూ.1.25 కోట్లకు అమ్ముడుపోయింది.

రిజిస్ట్రేషన్ శాఖ (IGR)కి అందించిన డాకుమెంట్స్ ప్రకారం..
ఈ ఆఫీస్ స్థలం వన్ ప్లేస్ లోధాలో ఉంది. అలాగే ఈ స్థలం దాదాపు 1,146.88 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ డీల్ పై రూ.48 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) ప్రకారం, వన్ ప్లేస్ లోధా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్. దీనిని మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) డెవలప్ చేసింది. అలాగే 1.08 ఎకరాలలో విస్తరించి ఉండగా, 27,392 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్థలం ఉంది.
స్క్వేర్ యార్డ్స్ డేటా ఇంటెలిజెన్స్ ప్రకారం..
మే 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య వన్ ప్లేస్ లోధాలో మొత్తం ఎనిమిది అగ్రిమెంట్స్ జరిగాయి. ఈ డీల్ మొత్తం విలువ రూ.618 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లోని ఆస్తుల సగటు ధర గజానికి రూ. 48,000. లోయర్ పరేల్ ముంబైలోని రెసిడెన్షియల్ & కమర్షియల్ ప్రాంతాలలో ఒకటి. అంతేకాక బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) & నారిమన్ పాయింట్ వంటి బిజినెస్ ప్రాంతాలకు బాగా దగ్గర ఉంటుంది. స్క్వేర్ యార్డ్స్ ప్రకారం, అభిషేక్ బచ్చన్, షాహిద్ కపూర్, అమిష్ త్రిపాఠి ఇంకా మనోజ్ బాజ్‌పేయి వంటి బాలీవుడ్ తారలకు కూడా లోయర్ పరేల్‌లో ఇళ్ళులు ఉన్నాయి. ఈ సమాచారం IGR ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పేపర్స్ నుండి లభించింది.
అక్షయ్ కుమారుకు బంపర్ లాభం
తాజాగా అక్షయ్ కుమార్ అమ్మిన అపార్ట్‌మెంట్లపై మంచి లాభం అందుకున్నాడు. 5.35 కోట్లకు అమ్మిన ఈ అపార్ట్‌మెంట్‌ను అక్షయ్ కుమార్ 2017 నవంబర్‌లో కేవలం 2.82 కోట్లకు కొన్నాడు. ఈ విధంగా దాని విలువ 89 శాతం పెరిగింది. ఈ అపార్ట్‌మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). ఈ అపార్ట్‌మెంట్‌కు రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. అలాగే రూ.1.25 కోట్లకు విక్రయించిన రెండవ అపార్ట్‌మెంట్‌ను 2017లో రూ.67.19 లక్షలకు కొన్నాడు. దీని విలువ కూడా 86 శాతం పెరిగింది. ఈ అపార్ట్‌మెంట్ కార్పెట్ ఏరియా 23.45 చదరపు మీటర్లు (252 చదరపు అడుగులు).

Read Also: Pahalgam Terror Attack : ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

#telugu News Actor Akshay Kumar Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu income in crores Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.