చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

Japan: చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

మరణశిక్షపై 55 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపి గత ఏడాది నిర్దోషిగా విడుదలైన ఓ జపాను వృద్ధుడికి 14 లక్షల డాలర్ల(దాదాపు రూ.12 కోట్లు) నష్ట పరిహారాన్ని న్యాయస్థానం ప్రకటించింది. తప్పుడు కేసులో అత్యంత సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని గడిపినందుకు రోజుకు 85 డాలర్లను (దాదాపు రూ.12,300) చొప్పున నష్ట పరిహారంగా అందచేయాలని షిఝువోకా జిల్లా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేసు పూర్తి వివరాలు
మాజీ ప్రొఫెషనల్‌ బాక్సర్‌ అయిన 89 ఏళ్ల ఇవావో హకమాటా 1968లో నలుగురు వ్యక్తుల హత్యకు సంబంధించిన కేసులో అరెస్టయ్యారు. అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మృతుల వద్ద లభించిన రక్తపు మరకలు ఉన్న బట్టలను ప్రధాన సాక్ష్యంగా పరిగణించిన కోర్టు హకమాటాకు మరణశిక్ష విధించింది.

Advertisements
చేయని నేరానికి 55 ఏళ్లకు పైగా జైలుశిక్ష..12 కోట్ల నష్ట పరిహారం

అతి పెద్ద నష్టపరిహారం ప్రకటించిన కోర్టు
అయితే ఈ బట్టలను డీఎన్‌ఏ పరీక్షకు పంపగా వాటిని మృతదేహాల వద్ద పోలీసులే ఉంచారని బయటపడింది. దీంతో హకమాటా మరణశిక్షను కోర్టు రద్దు చేసింది. తప్పుడు కేసులో మరణశిక్షను ఎదుర్కొని అత్యంత సుదీర్ఘకాలం జైలు జీవితాన్ని గడిపిన తొలి వ్యక్తిగా హకమాటా జపాను చరిత్రలో నిలిచిపోయారు. ఆయనకు కోర్టు ప్రకటించిన నష్టపరిహారం అతి పెద్ద మొత్తమని, అయితే ఆయన కోల్పోయిన జీవితాన్ని ఏదీ భర్తీ చేయలేదని హకమాటా తరఫు న్యాయవాది హిడెయో ఓగావా వర్ణించారు. 1961లో ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా రిటైర్‌ అయిన హకమాటాకు సెంట్రల్‌ జపాన్‌లోని షిఝువోకాలోని సోయాబీన్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో ఉద్యోగం లభించింది. రెండేళ్ల తర్వాత ఆయన యజమాని, యజమాని భార్య, వారి ఇద్దరు పిల్లలు వారి ఇంట్లో కత్తిపోట్లకు గురై మరణించారు. తన చేత పోలీసులే బలవంతంగా నేరాన్ని ఒప్పించారని ఇవావో హకమాటా వాదించాడు.

Related Posts
ఇండిగో ఎయిర్లైన్స్: ప్రయాణికుల భద్రతపై దృష్టి
Indigo

ఇండిగో ఎయిర్లైన్స్, శుక్రవారం సాంకేతిక సమస్య కారణంగా ఢిల్లీకి వెళ్లాల్సిన తన విమానం రద్దయిన ప్రయాణికులను తిరిగి తీసుకువెళ్ళేందుకు ఇస్తాంబుల్‌కు రెండు ప్రత్యేక విమానాలను పంపుతోంది.ఈ ఘటనలో, Read more

రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్
రిలయన్స్ క్యాపిటల్‌ కొనుగోలుకు ఇండస్ఇండ్ కు గ్రీన్ సిగ్నల్

అనిల్ అంబానీ ప్రస్తుతం వార్తల్లో కనిపిస్తున్న ఈ వ్యాపారవేత్త అందరికంటే ముందుగానే అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించినప్పటికీ వాటిని సవ్యంగా నిర్వహించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అప్పుల Read more

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి
world oldest man john alfre

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు Read more

పూణె బస్సులో యువతిపై లైంగికదాడి
పూణె బస్సులో యువతిపై లైంగికదాడి

మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను ఖాళీగా ఉన్న బస్సులోకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×