ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు:
పరీక్షల వేళ విద్యార్ధులకు ఒత్తిడి నివారణకు టిప్స్ సూచించారు. తన జీవిత అనుభవాలను వారితో పంచుకున్నారు. ఏ విషయంలోనూ ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని సూచించారు. భయాన్ని అధిగమిస్తూ పరీక్షలకు సిద్దం కావాలని పేర్కొన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. మనం రోబోలం కాదని.. మనుషులమని చెప్పారు.పరీక్షల వేళ ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ నిర్వహించారు. ఇందు కోసం 3.15 కోట్ల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లి దం డ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్‌గా పాల్గొన్నారు.
పీఎం మోదీ విద్యార్ధులకు కీలక సూచనలు చేసారు. ఆటలు కూడా ముఖ్యమని క్రీడల, ద్వారా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి అంతా పోయి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్ధులకు రిలాక్సేషన్ అవసరమని, విద్యార్ధులను ఒకే చోట బంధించి పుస్తకాల పురుగుగా మార్చే యడం సరికాదని పేర్కొన్నారు. విద్యార్ధులకు కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయని.. అవి చేసే స్వేచ్ఛ ఇస్తే చదువులోనూ ముందంజలో ఉంటారని సూచించారు ప్రధాని. పరీక్షలే జీవితం అనుకోవద్దని.. ఇలాంటి ఆలోచన కరెక్ట్ కాదన్నారు మోడీ. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, స్కూల్ పాఠాల దగ్గరే ఆగిపోవద్దని.. జ్ఞానాన్ని పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. జ్ఞానం ఎంత పెంచుకున్నా తక్కువేనన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని సూచించారు.. విద్యార్ధులు ఆరో గ‌్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని చెప్పారు.
పరీక్షను ఒత్తిడి కాకుండా ఒక అవకాశంగా తీసుకోండి:
ప్రధాని మోదీ పరీక్షలను ఒత్తిడి అని భావించకుండా, అది తమ సామర్థ్యాన్ని మెలకువగా చూపించేందుకు ఇచ్చిన అవకాశంగా చూడాలని విద్యార్థులకు చెప్పారు. ఈ విధంగా వారు మరింత ఉత్సాహంగా, నైపుణ్యాలతో పరీక్షలకు సిద్ధం అవుతారు.
అవగాహన & సమయం పరిమితి:
విద్యార్థులకు సమయాన్ని సక్రమంగా ఉపయోగించడం కోసం, ముఖ్యంగా సమయం పరిమితి ఉన్న పరీక్షలు ఉంటాయి. “ఆప్త సమయం ఉపయోగించుకోండి” అని ఆయన సూచించారు. ఇది వారికి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించడానికి, ఒక్కో ప్రశ్నపై ఎక్కువ సమయం వెచ్చించకుండా సమగ్ర సమాధానాలను అందించడానికి సహాయపడుతుంది.
విద్యార్థుల అభిప్రాయం:
ప్రధానమంత్రిగారి ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు వారికి తగిన జ్ఞానాన్ని ఇవ్వాలని పరిగణించే వారు ఆనందంగా స్పందించారు. ఈ సూచనలు వారిలో నమ్మకం, స్ఫూర్తిని అందించి, ఒత్తిడిని తగ్గించి, పరీక్షలను ప్రశాంతంగా ఎదుర్కొనడానికి ప్రేరణ కల్పిస్తాయి.