LPG rates in India are the highest in the world!

LPG Rate : ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !

LPG Rate : పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. గ్యాస్‌, పెట్రో ధరల పెంపులో మోడీ సర్కారు కొత్త రికార్డులను నమోదు చేసింది.

Advertisements
ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే

ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానం

ప్రపంచంలో మరే ఇతర దేశాధినేతకు సాధ్యంకాని ఫీట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంతం చేసుకొన్నారు. ప్రజలపై ఇంధన భారాన్ని అత్యధికంగా మోపిన ప్రధానుల్లో మోడీ నంబర్‌ 1 ప్లేస్‌లో నిలిచారు. అంతేకాదు.. ఎల్పీజీ ధర ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ తొలి స్థానంలో నిలిచింది. అలాగే పెట్రోల్‌ రేటులో మూడు, డీజిల్‌ రేటులో ఎనిమిదో స్థానాన్ని సాధించింది. ఈ మేరకు నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ప్రజల కొనుగోలు శక్తితుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పీపీపీ) విధానాన్ని బట్టి ఏఐ చాట్‌బాట్‌ ‘గ్రోక్‌’ సమాధానాలు ఇచ్చింది.

భారత్‌లోనే ఎల్పీజీ సిలిండర్‌ ధర అత్యధికం

గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంలో ప్రపంచంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందున్నారు. పదకొండేండ్ల మోడీ పాలనలో దేశంలో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ (పీపీపీ) ఆధారంగా ఈ విషయం స్పష్టమవుతున్నది. పీపీపీ ఆధారంగా గణిస్తే.. ప్రపంచ దేశాల్లోకెళ్లా భారత్‌లోనే ఎల్పీజీ సిలిండర్‌ ధర అత్యధికంగా ఉన్నది. భారత్‌లో ఒక సిలిండర్‌ను కొనుగోలు చేయడానికి 43 పీపీపీ డాలర్లను వెచ్చించాల్సి వస్తున్నది. అమెరికా, బ్రిటన్‌, చైనాతో పాటు పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ వంటి దేశాలతో పోల్చిచూసినా ఇది ఎంతో ఎక్కువ.

Read Also : వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !

Related Posts
Ranya Rao :రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Ranya Rao :రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్ట్‌ కావడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని దుబాయ్‌ Read more

వైట్ హౌస్‌లో ట్రంప్ మరియు బైడెన్ సమావేశం
Trump Biden 1

అమెరికా అధ్యక్షులుగా ట్రంప్ మరియు బైడెన్ మధ్య తొలిసారి భేటీ జరిగింది. ఈ భేటీ వైట్ హౌస్‌లో జరిగింది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, బైడెన్ Read more

ట్రూడో గోప్య సమాచార లీక్ లను తీవ్రంగా ఖండించారు: మోడి పై తప్పు కథనాలు
canada 1

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణానికి భారత ప్రధాని నరేంద్రమోడికి సంబంధం ఉన్నట్టు ఫేక్ రిపోర్ట్ లీక్ అయ్యే సమయంలో, Read more

Congress: రేపు ఢిల్లీకి కాంగ్రెస్ బీసీ నేతలు
Congress BC leaders to Delhi tomorrow

Congress: తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×