CM Revanth : అమెరికాలో దొడ్లు కడిగేవాళ్లు అంటూ కేటీఆర్ పై సీఎం రేవంత్ పరోక్షంగా సెటైర్లు

Follow Us: Google News Daily Hunt
cm revanth reddy letter to center on hyderabad metro
cm revanth reddy letter to center on hyderabad metro
FONT SIZE
GET APP

CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌లపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత గులాబీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటైన విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు కనీస వసతులు లేని వారికి నేడు బెంజి కార్లు వచ్చాయని, గతంలో అమెరికాలో దొడ్లు కడిగేవాళ్లు ఇక్కడకు వచ్చి మంత్రులయ్యారంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు వేశారు. అలాగే పాస్‌పోర్ట్ బ్రోకర్ పనులు చేసిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారంటూ కేసీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాం నవాబుల కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించి, విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు ఎలా కట్టుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also : NTR డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రూ. 8 లక్షల కోట్ల అప్పులు – నిరుద్యోగుల ఆత్మహత్యలపై తీవ్ర ఆగ్రహం

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఏకంగా రూ. 8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ముంచేశారని ఆయన ధ్వజమెత్తారు. నిధులు, నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను ముంచేశారని, గత ప్రభుత్వ హయాంలో సరైన నోటిఫికేషన్లు లేక, పేపర్ లీకేజీల కారణంగా ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులు మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల స్వార్థ ప్రయోజనాల వల్లే రాష్ట్రం ఇంతటి సంక్షోభంలో పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అస్తవ్యస్త వ్యవస్థను బాగు చేసేందుకు నిరంతరం కృషి చేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు