Tragedy in Anakapalli : అనకాపల్లిలో విషాదం: బావిలో దూకి ఇంటర్ ప్రేమజంట ఆత్మహత్య

Follow Us: Google News Daily Hunt
Bhopal Crime
Bhopal Crime
FONT SIZE
GET APP

Tragedy in Anakapalli : అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలో తీవ్ర సంచలనం రేపిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. విశాఖపట్నం నగర పరిధిలోని పెందుర్తికి చెందిన 17 ఏళ్ల యువతి, యువకుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఒకే కళాశాలలో చదువుకుంటున్న వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో గతంలో కూడా వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు. చదువు పూర్తయి, జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేస్తామని పెద్దలు హామీ ఇచ్చారు.

Read Also: Haribabu Murder: ‘నేనే చంపా’ అంటూ సోదరుడి సెల్ఫీ వీడియో

Tragedy in Anakapalli
Tragedy in Anakapalli

Tragedy in Anakapalli : “మా చావుకు ఎవరూ కారణం కాదు”

అయినప్పటికీ, పెద్దల మాటలను లెక్కచేయకుండా ఇటీవల ఇద్దరూ మరోసారి ఇళ్ల నుంచి కనిపించకుండా పోయారు. గురువారం రోజున కె.కోటపాడు మండలంలో ఉన్న యువకుడి అమ్మమ్మ గ్రామానికి చేరుకున్నారు. ఊరి వెలుపల ఉన్న పైడమ్మ చెరువు సమీపంలోని ఒక వ్యవసాయ బావిలోకి ఇద్దరూ దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. స్థలంలో లభ్యమైన సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. “మా చావుకు ఎవరూ కారణం కాదు” అని యువకుడు ఆ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు