Lalit Modi Vanuatu citizenship revoked!

లలిత్ మోదీకి వనాటు పౌరసత్వం రద్దు!

వనాటు: ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి వనాటు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. లలిత్ మోడీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని వనాటు ప్రధాని జోతం నపట్.. పౌరసత్వ కమిషన్‌కు ఆదేశించారు. ఇటీవలే దక్షిణ పసిఫిక్ మహాసముద్ర దేశమైన వనాటు పౌరసత్వానికి చెందిన గోల్డెన్ పాస్‌పోర్టును లలిత్ మోదీ తీసుకున్నారు. ఇండియాలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినందుకు లలిత మోడీని స్వదేశానికి రప్పించేందుకు ఇప్పటికే భారత్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే లండన్‌ను భారత్ కోరింది. అక్కడ నుంచి వనాటుకు మకాం మార్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వనాటు ప్రభుత్వం కూడా పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది.

లలిత్ మోదీకి వనాటు పౌరసత్వం

2010లో భారతదేశం విడిచి వెళ్లిన లలిత్ మోదీ

లలిత్ మోదీపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాక వనాటు ప్రభుత్వం అప్రమత్తం అయింది. దీంతో లలిత్ మోడీకి జారీ చేసిన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని ప్రధాన మంత్రి జోతం నపట్ ఆ దేశ పౌరసత్వ కమిషన్‌ను కోరినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి వెళ్లారు. ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనిపై వేటు పడింది. అనంతరం లండన్‌కు పారిపోయారు.

ఆమెతో ప్రయాణం సాగుతుందని

ఇటీవల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కొత్త గర్ల్ ఫ్రెండ్‌ను లలిత్ మోదీ పరిచయం చేశారు. ఆమెతో ఎప్పటి నుంచో స్నేహం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు.. అంతకముందు కూడా మాజీ మిస్ యూనివర్సిల్ సుస్మితా సేన్‌తో కూడా ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమెతో ప్రయాణం సాగుతుందని పేర్కోన్నారు. మళ్లీ ఏమైందో తెలియదు గానీ.. ఇటీవల మరో కొత్త ప్రియురాలిని పరిచయం చేశారు.

Related Posts
రూ .2.98 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్..
Assembly meeting from today. Cabinet approves AP budget

అమరావతి: ఈరోజు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జె‌ను ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ. 2.9 లక్షల కోట్లతో Read more

టెట్ ఫ‌లితాలు విడుదల .
tet results

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు Read more

కేంద్ర బడ్జెట్..రాయితీలు, మినహాయింపులపై కోటి ఆశలు..
Central budget..Crore hopes on concessions and exemptions..

న్యూఢిల్లీ: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ నేడు సభలోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను Read more

కొత్త రేషన్ కార్డులపై గందరగోళం
new ration card meeseva

కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియపై పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను గందరగోళానికి గురిచేశాయి. మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని పౌర సరఫరాల Read more