KTR responded to ED notices

ఈడీ నోటీసులపై స్పందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్‌ సమాధానం పంపారు.

image
image

గత వారం కిందట ఫార్ములా-ఈ రేస్‌ వ్యవహారం కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈ నెల 7న విచారణకు రావాలని కోరింది. కేటీఆర్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌కు, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 2, 3న విచారణకు రావాలని అరవింద్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో ఆదేశించగా.. హాజరయ్యేందుకు గడువు కోరారు.

కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఉదయం తీర్పును వెలువరించనున్నది. ఫార్ములా-ఈ రేస్‌లో ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే హైకోర్టు ఇరువర్గాల వాదనలు విని.. తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, తీర్పును వెలువరించే వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం ఉదయం 10.30 గంటలకు కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

Related Posts
ఏపీలో మార్చి 17 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
ap10thexams

ఆంధ్రప్రదేశ్‌లో 2025 సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుండి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఈ పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వానికి పంపింది. Read more

ఆదోనికి పోసాని కృష్ణమురళి
Krishna Murali, who gave it to Adoni

అమరావతి: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో Read more

Primary Schools : ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు: ప్రభుత్వం నిర్ణయం!
Computers for primary schools.. Government decision!

Primary Schools : తెలంగాణ వ్యాప్తంగా 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని Read more

గద్దర్ కూతురికి కీలక పదవి కట్టబెట్టిన రేవంత్ సర్కార్
vennela

గద్దర్‌ కూతురు డాక్టర్‌ గుమ్మడి వెన్నెలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా నియమిస్తూ.. ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు Read more