Kimbal Musk కింబల్ మస్క్ గురించి చిన్న పరిచయం

Kimbal Musk : కింబల్ మస్క్ గురించి చిన్న పరిచయం

ప్రముఖ పారిశ్రామికవేత్త కింబల్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు ఈసారి కారణం – డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా సుంకాల నిర్ణయాలపై ఆయన తీవ్ర విమర్శలు చేయడం.కింబల్ మస్క్ ఎవరో కాదు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోదరుడు. అమెరికన్ వినియోగదారులపై ఈ టారిఫ్‌లు భారం మోపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ట్రంప్ విధానాలు కొనుగోలు శక్తిని దెబ్బతీస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.ఇది ప్రజల జేబులకు నష్టం చేస్తుందని అన్నారు.”అమెరికాలో అవకాశాలు చాలానే ఉన్నాయి, బలహీనతల్ని ఆవలంచడం అవసరం లేదు,” అని ఆయన సూచించారు.1972 సెప్టెంబర్ 29న దక్షిణాఫ్రికాలో జన్మించిన కింబల్, వ్యాపారవేత్త, రెస్టారెంట్లు నిర్వహకుడు, దాతగా పేరు సంపాదించారు.

Advertisements
Kimbal Musk కింబల్ మస్క్ గురించి చిన్న పరిచయం
Kimbal Musk కింబల్ మస్క్ గురించి చిన్న పరిచయం

ఆయన కెరీర్‌ ప్రారంభం 1995లో, సోదరుడు ఎలాన్‌తో కలసి Zip2 అనే టెక్ కంపెనీ స్థాపించడంతో మొదలైంది.ఇది వ్యాపార సమాచారం, మ్యాపింగ్ సేవలు అందించేది.టెక్ రంగం తర్వాత, కింబల్ దృష్టి ఆహార పరిశ్రమపై పెట్టారు. Farm-to-Table కాన్సెప్ట్ ఆధారంగా అమెరికాలో పలు నగరాల్లో రెస్టారెంట్లు స్థాపించారు. 2016లో ‘Square Roots’ అనే అర్బన్ ఫార్మింగ్ కంపెనీకి స్థాపకుడయ్యారు. ఇందులో హైడ్రోపోనిక్ టెక్నాలజీతో కూరగాయలు పండిస్తారు.కింబల్ మస్క్ టెస్లా, స్పేస్‌ఎక్స్, చిపోటిల్ గ్రిల్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా ఉన్నారు.

విద్య, ఆహార రంగాల్లో సేవలందించేందుకు Big Green అనే సంస్థను ప్రారంభించారు. ఇది అమెరికా పాఠశాలల్లో ‘లెర్నింగ్ గార్డెన్స్’ అనే అవుట్‌డోర్ తరగతుల్ని ఏర్పాటు చేసింది.ఎలాన్ మస్క్‌తో వృత్తిపరంగా పని చేయడంలో కొన్ని సార్లు విభేదాలు తలెత్తాయని కింబల్ చెప్పారు. చిన్నతనంలో వారు కొట్టుకున్నప్పటికీ వెంటనే కలిసి నవ్వుకునేవారంటారు. అయితే కుటుంబ బంధం మాత్రం బలంగానే ఉందంటున్నారు.కింబల్, ఎలాన్, టోస్కా – ముగ్గురు సోదరులు ఎంతో సన్నిహితంగా ఉంటారని టోస్కా వెల్లడించారు. “మేము తరచూ కలిసి గడిపేందుకు చూస్తాం. కింబల్ చెఫ్ కావడంతో అతని వంటలు కూడా మమ్మల్ని కలుపుతాయి,” అంటూ ఆమె అన్నారు.కింబల్ మస్క్ – ఓ వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా తనదైన ముద్ర వేస్తున్నాడు. ట్రంప్ పాలసీలపై విమర్శలు చేస్తూనే, సమాజానికి ఉపయోగపడే మార్గాలు సూచించడంలో ముందుంటున్నాడు.

Related Posts
Purandeshwari : ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు: పురందేశ్వరి
Purandeshwari ముస్లింల ఓటు దుష్ప్రచారం చేస్తున్నారు పురందేశ్వరి

ముస్లింల ఓటు బ్యాంకు కోసం బీజేపీపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి మండిపడ్డారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.అంబేద్కర్ Read more

మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు
Curfew imposed in many parts of Manipur

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇటివల జిరిబామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. అయితే Read more

‘కేర్‌గివర్స్ హ్యాండ్‌బుక్‌’తో చికిత్స సులభతరం
Launch of Care Givers Handbook in Hyderabad for Medical treatment

· తెలంగాణ ప్రభుత్వ, సెర్ప్ సీఈఓ & ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి శ్రీమతి దివ్య దేవరాజన్, హైదరాబాద్ యొక్క ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా రోగులకు Read more

Dasoju Shravan : రేవంత్ రెడ్డి వైఖరిపై విమర్శలు : దాసోజు శ్రవణ్
Dasoju Shravan రేవంత్ రెడ్డి వైఖరిపై విమర్శలు దాసోజు శ్రవణ్

తాజా రాజకీయ పరిణామాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ జింకను చంపినందుకు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×