हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కేశినేని

Vanipushpa
బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కేశినేని

ఒకప్పుడు విజయవాడ ఎంపీగా రెండుసార్లు గెలిచి టీడీపీలో కొనసాగిన కేశినేని నాని ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతే కాదు తనకు రెండుసార్లు టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు, లోకేష్ పైనే నిప్పులు చెరిగారు. తిరిగి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయవాడలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఓ రేంజ్ లో వీచిన కూటమి గాలిలో తమ్ముడు కేశినేని చిన్ని చేతిలోనే ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు.
పురందేశ్వరితో కేశినేని నాని మంతనాలు
అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో కేశినేని నాని టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక బీజేపీ నేతల్ని కలవడం, జాతీయ నేత గడ్కరీని సందర్భం వచ్చినప్పుడల్లా పొగడటం చూసి ఆయన కాషాయ గూటికి చేరిపోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. తన ప్రజాసేవ కొనసాగుతుందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన కేశినేని


ప్రజల సంక్షేమం కోసం కృషి
ఇటీవలి మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి తన వైఖరిని స్పష్టం చేస్తున్నానంటూ కేశినేని ఓ ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని, ఆ నిర్ణయం మారదని కేశినేని నాని తెలిపారు. అయితే, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను హృదయపూర్వకంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని కేశినేని తెలిపారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.

అంకితభావంతో ..

సమాజానికి తన సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదన్నారు. కానీ విజయవాడలోని తన తోటి పౌరుల శ్రేయస్సు కోసం తన లోతైన అంకితభావంతో ముడిపడి ఉందన్నారు.
తన రాజకీయ పునరాగమనానికి సంబంధించి ఎలాంటి నిరాధారమైన వార్తలను పట్టించుకోవద్దని ఆయన అందరినీ కోరారు. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దాని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందన్నారు. తన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అదే అభిరుచి, నిబద్ధతతో తన సేవను కొనసాగించడానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870