Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్ డైనమిక్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పాటలు భారీ అంచనాలు పెంచాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేస్తానని విష్ణు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామం అయిన అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని ఊటుకూరు ను సందర్శించారు. గ్రామస్తులు ఆలయ సిబ్బంది విష్ణు మరియు కన్నప్ప టీమ్‌ను ఘనంగా సన్మానించారు.

Advertisements
Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్
Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

విష్ణు కన్నప్ప కుటుంబ స్వగృహాన్ని సందర్శించి, అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ భారీ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా స్టీఫెన్ దేవస్సీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఇప్పటివరకు విడుదలైన పాటలు సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.’కన్నప్ప’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, విష్ణు మంచుకు కెరీర్‌లోనే పెద్ద హిట్ అందిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts
ఓటిటి లోకి రానున్న పోతగడ్డ సినిమా
ఓటిటి లోకి రానున్న పోతగడ్డ సినిమా

సంక్రాంతి తరువాత సినిమాల జోరు క్రమంగా తగ్గుతోంది.కొత్త చిత్రాలు విడుదలయ్యే కొద్దీ,గతంలో వచ్చిన సినిమాల కలెక్షన్లు తగ్గిపోతున్నాయి.ఈ శుక్రవారం (జనవరి 31) కూడా కొత్త సినిమాలతో థియేటర్లు Read more

ప్రేమ పూర్తిగా వ్యక్తిగతం: సమంత
ప్రేమ పూర్తిగా వ్యక్తిగతం: సమంత

తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ సమంత, ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ హీరోయిన్, Read more

Rashmika Mandanna: గాయం నుంచి కోలుకోడానికి సమయం పడుతుంది:రష్మిక
Rashmika Mandanna: గాయం నుంచి కోలుకోడానికి సమయం పడుతుంది:రష్మిక

పాన్ ఇండియా హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో తన ప్రత్యేకమైన Read more

ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్
ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న మూవీ

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో దుమ్మురేపిన సూపర్ హిట్ కంటెంట్‌ను ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్‌లో భారీ విజయాన్ని సాధించిన ప్రాజెక్ట్స్‌ను వెండితెరపై Read more

×