ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న మూవీ

ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో దుమ్మురేపిన సూపర్ హిట్ కంటెంట్‌ను ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూపించేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్‌లో భారీ విజయాన్ని సాధించిన ప్రాజెక్ట్స్‌ను వెండితెరపై మళ్లీ జనాలకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సూపర్ హిట్ కథలకు ప్రీక్వెల్స్, సీక్వెల్స్ రూపంలో సినిమాలు రూపొందిస్తున్నారు.ఇటీవల ఓటీటీలో ఘన విజయం సాధించిన ప్రాజెక్ట్— ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‘. ఈ పీరియాడిక్ ఫ్యామిలీ డ్రామా ప్రతి తెలుగు ప్రేక్షకుడికి మంచి అనుభూతిని కలిగించింది.

Advertisements
ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న మూవీ
ఓటీటీలో సూపర్ హిట్..బిగ్ స్క్రీన్ పై రానున్న మూవీ

ఈ నేపథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ షోకు సీక్వెల్‌ను వెండితెరపై తీసుకురావాలని నిర్ణయించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సాయి సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు.’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’లో ఉన్న చిన్న పిల్లాడి క్యారెక్టర్‌ను కథానాయకుడిగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాత్రలో యువ హీరో ఆనంద్ దేవరకొండ నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘యాన్ అన్‌ఫినిష్డ్ స్టోరీ’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవీ చైతన్య కథానాయికగా నటిస్తోంది.ఓటీటీలో ఘన విజయం సాధించిన ‘పొలిమేర’కు సీక్వెల్‌ను సినిమాగా రూపొందించారు. అదే కాస్టింగ్‌తో కానీ ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి హిట్ కొట్టారు.

ఈ విజయాలతో మరిన్ని వెబ్ షోస్‌ను బిగ్ స్క్రీన్‌పై చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇది తెలుగులోనే కాదు, నార్త్ ఇండియాలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. మిర్జాపూర్ వెబ్ సిరీస్‌కు ప్రీక్వెల్‌ను సినిమాగా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘సిటాడెల్’ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలో సినిమాగా రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.ఈ విధంగా డిజిటల్ హిట్స్‌ను వెండితెరపై చూపించడం ద్వారా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు, సినీ పరిశ్రమకు కూడా కొత్త ఊపునిస్తుంది.

Related Posts
తండేల్ బాక్సాఫీస్ కలెక్షన్లు ?
Yoga Training You Tube Channel Thumbnail (3)

నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, Read more

L2-Empuraan : విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్ ..షాక్ లో హీరో
L2-Empuraan : విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్ ..షాక్ లో హీరో

సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారిన సమస్యపైరసీ. సినిమా విడుదలకు ముందే కొన్ని చిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ అవుతుంటాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన Read more

నటి సోనాలి బింద్రేతో ప్రేమాయణం పై మౌనం
Sonali Bendre

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది, బాలీవుడ్ నటి సోనాలి బింద్రేతో సంబంధం పట్ల సర్క్యులేట్ అయ్యిన పుకార్లను స్పష్టంగా ఖండించారు. ఇటీవల జరిగిన ఒక ఉర్దూ Read more

సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి విమర్శించారా?
chiranjeevi

ఇప్పుడు టాలీవుడ్‌లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చాలా హైప్‌ అందుకుంది.2024 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన Read more

Advertisements
×