Justice Sujoy Paul as the new CJ of Telangana High Court

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

హైరదాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే.. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.

జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ విద్యను పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం.. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు తన సేవలను అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. కాగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవటం గమనార్హం.

image
image

కాగా, జస్టిస్‌ అరాధే తెలంగాణ హైకోర్టులు 18 నెలల పాటు సేవలు అందించారు. 2023 జులై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులయ్యారు. జులై 23న పదవీ ప్రమాణంచేసి బాధ్యతలు చేపట్టారు. 1964 ఏప్రిల్‌ 13న రాయ్‌పుర్‌లో జన్మించిన జస్టిస్‌ ఆలోక్ అరాధే.. 1988 జులై 12న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. జబల్‌పుర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ కొనసాగించారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2011 ఫిబ్రవరి 15న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Related Posts
బీఆర్ఎస్‌లో చేరిన మ‌హేశ్ రెడ్డి
mahesh brs

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి... Read more

రేషన్ బియ్యం మాయం కేసు..నిందితులకు 12 రోజుల రిమాండ్
12 day remand for the accused in the ration rice misappropriation case

విజయవాడ: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు 12 రోజులు రిమాండ్ విధించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్ని జయసుధకి చెందిన Read more

ప్రారంభం కానున్నబడ్జెట్.. ఆశాజనకంగా ఇన్వెస్టర్లు
nirmala

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న వారి భవిష్యత్తుకు బడ్జెట్ ఎలాంటి మార్గం వేస్తుందనే Read more

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ
ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ

ఆమ్ ఆద్మీ రాజకీయాలు అంటే సేవ అన్న అతిశీ గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ ఏ Read more