పశ్చిమాసియా మళ్లీ అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్(Teharan)పై తీవ్ర వైమానిక దాడులకు తెగబడడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్, ఇద్దరు శాస్త్రవేత్తలు సహా పలువురు కీలక అధికారులు మృతిచెందినట్లు సమాచారం. ఇరాన్‌లోని కెర్మాన్‌షా, లోరెస్థాన్, టెహ్రాన్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
ఇరాన్ అణు స్థావరాలే టార్గెట్ గా దాడులు
కాగా ఇజ్రాయెల్ టెహ్రాన్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని బాంబుల దాడులు నిర్వహించింది. ఇరాన్ అణు స్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. అలానే కీలక సైనిక కేంద్రాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి.

ఈ ఘటనపై అమెరికా (USA) వెంటనే స్పందించింది. ఈ దాడుల్లో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ”ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఏకపక్షంగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అమెరికా పాత్ర లేదని.. ఆ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం పైనే మా దృష్టి ఉందని స్పష్టం చేశారు. భారత ఎంబసీలు హెచ్చరిక.. అలానే ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా, ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ సూచించింది. స్థానిక ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షిస్తూ తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలని ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు తరలివెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు పెరిగే అవకాశముండటంతో అంతర్జాతీయంగా కూడా ఆందోళన నెలకొంది.
అమెరికా స్పందన
“ఈ దాడుల్లో మా పాత్ర లేదు” – అమెరికా
ఈ పరిణామాలపై అమెరికా తక్షణమే స్పందించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన చేస్తూ, “ఈ దాడుల్లో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదు. ఇది పూర్తిగా ఇజ్రాయెల్ తీసుకున్న చర్య,” అని తెలిపారు. తమ దృష్టి ప్రధానంగా అక్కడ ఉన్న అమెరికన్ దళాల భద్రతపైనే ఉందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్‌తో పాటు ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలు, మరికొందరు అధికారులు మృతిచెందినట్లు సమాచారం. టెహ్రాన్‌తో పాటు కెర్మాన్‌షా, లోరెస్థాన్ ప్రాంతాలు కూడా ఈ దాడుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Read Also: Stock Market: విమాన దుర్ఘటనతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు