బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్ దుమారం ?

బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్ దుమారం ?

బెంగళూరులో అంతులేని ట్రాఫిక్ జామ్‌లు మరోసారి వార్తల్లో ప్రధాన చర్చకు దారితీశాయి. అభివృద్ధికి తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవటంతో నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు ఆఫీసులకు వెళ్లినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల గంటల తరబడి సమయాన్ని రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ షేర్ చేసిన వైరల్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు వార్తల్లోను పెద్ద చర్చకు దారితీసింది. ఇది “4-రోజులు, 3-రాత్రి బెంగళూరు ‘ట్రాఫిక్’ టూరిజం” ప్యాకేజీని వ్యంగ్యంగా ప్రచారం చేసింది. ఈ పొటోలో నగరంలో భారీ రద్దీకి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్, సిల్క్ రోడ్ జంక్షన్, మారతహళ్లి, HSR లేఅవుట్ తప్పనిసరిగా సందర్శించాల్సిన గమ్యస్థానాలుగా పేర్కొనబడ్డాయి.

Advertisements
బెంగళూరు ట్రాఫిక్ పై టూరిజం ప్యాకేజ్  దుమారం ?

బెంగళూరుపై విచారకరమైన జోక్

మోహన్ దాస్ పాయ్ తన చిత్రాన్ని షేర్ చేస్తూ.. బెంగళూరుపై విచారకరమైన జోక్. కనీసం మన బాధలు, శ్రద్ధ లేని ప్రభుత్వం గురించి హాస్యంగా ఉందన్నారు. “బెంగళూరు ట్రాఫిక్ టూరిజం” అని పిలవబడే పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఇంటర్నెట్‌లోని ఒక విభాగం ఇందులోని వ్యంగ్యాన్ని చూసి నవ్వుతుండగా మరికొందరు మాత్రం దీనితో సంతోషంగా లేరు. అలాగే కొందరు ఈ జోక్ కన్నడలో రాయకపోవటంతో బాధపెడుతోందని కామెంట్ చేశారు.

ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి

నగరంలోని వివిధ ప్రాంతాలలో రద్దీ కారణంగా యాత్ర ప్రారంభం కాలేదంటూ చమత్కారంగా కామెంట్ కనిపించింది. నగరంలోని సిల్క్ బోర్డ్ ప్రాంతం నుంచి రాగిగుడ్డ ఫ్లైఓవర్ పనిచేస్తున్న తర్వాత సిల్క్ బోర్డ్, HSR ఈ జాబితా నుండి బయటపడతాయని ఆశిస్తున్నామననారు. ఔటర్ రింగ్ రోడ్, మరతహల్లి కదలలేనివని మరొక వినియోగదారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రదేశాలను కలిపే ఒకే ఒక రహదారి ట్రాఫిక్ జామ్‌కు కారణమని గుర్తించడానికి మేధావి కానవసరం లేదని కామెంట్స్ కనిపించాయి. ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి కారణంగానే అవసరమైన స్థాయిలో రోడ్ల నిర్మాణం జరగలేదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

Related Posts
America : పనామాలో ఆశ్రయం కోసం మళ్లీ పోరాడుతున్న వలసదారులు
పనామాలో ఆశ్రయం కోసం మళ్లీ పోరాడుతున్న వలసదారులు

ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఇరాన్, చైనా దేశాలకు చెందిన వలసదారులు అమెరికా నుండి బహిష్కరించబడ్డారు.పనామాలో ఆశ్రయం పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వలసదారులు. అంతర్జాతీయ మానవతా సహాయం అందించడంలో లోపం. Read more

ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
nirmala

పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవరి 2025న ప్రారంభమై అలాగే ఏప్రిల్ 4న ముగుస్తాయి. ముఖ్యంగా Read more

రన్యారావుపై కేసు నమోదు
కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసు – సీబీఐ దర్యాప్తులో కీలక మలుపు!

కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న నటి రన్యారావు (34) ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులో ఇరుక్కొన్న విషయం సంచలనంగా మారింది. దుబాయ్ నుండి పెద్ద Read more

లక్నోలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు
Bomb threat to Taj Hotel in Lucknow

లక్నో: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం ఒక ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, ఈ నగరంలో ఇప్పటికే 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు Read more

Advertisements
×