బెంగళూరులో అంతులేని ట్రాఫిక్ జామ్‌లు మరోసారి వార్తల్లో ప్రధాన చర్చకు దారితీశాయి. అభివృద్ధికి తగిన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవటంతో నగరంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు ఆఫీసులకు వెళ్లినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల గంటల తరబడి సమయాన్ని రోడ్లపైనే గడపాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ షేర్ చేసిన వైరల్ ఇమేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు వార్తల్లోను పెద్ద చర్చకు దారితీసింది. ఇది “4-రోజులు, 3-రాత్రి బెంగళూరు ‘ట్రాఫిక్’ టూరిజం” ప్యాకేజీని వ్యంగ్యంగా ప్రచారం చేసింది. ఈ పొటోలో నగరంలో భారీ రద్దీకి సంబంధించిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా నగరంలోని ఔటర్ రింగ్ రోడ్, సిల్క్ రోడ్ జంక్షన్, మారతహళ్లి, HSR లేఅవుట్ తప్పనిసరిగా సందర్శించాల్సిన గమ్యస్థానాలుగా పేర్కొనబడ్డాయి.

బెంగళూరుపై విచారకరమైన జోక్
మోహన్ దాస్ పాయ్ తన చిత్రాన్ని షేర్ చేస్తూ.. బెంగళూరుపై విచారకరమైన జోక్. కనీసం మన బాధలు, శ్రద్ధ లేని ప్రభుత్వం గురించి హాస్యంగా ఉందన్నారు. “బెంగళూరు ట్రాఫిక్ టూరిజం” అని పిలవబడే పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. ఇంటర్నెట్‌లోని ఒక విభాగం ఇందులోని వ్యంగ్యాన్ని చూసి నవ్వుతుండగా మరికొందరు మాత్రం దీనితో సంతోషంగా లేరు. అలాగే కొందరు ఈ జోక్ కన్నడలో రాయకపోవటంతో బాధపెడుతోందని కామెంట్ చేశారు.
ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి
నగరంలోని వివిధ ప్రాంతాలలో రద్దీ కారణంగా యాత్ర ప్రారంభం కాలేదంటూ చమత్కారంగా కామెంట్ కనిపించింది. నగరంలోని సిల్క్ బోర్డ్ ప్రాంతం నుంచి రాగిగుడ్డ ఫ్లైఓవర్ పనిచేస్తున్న తర్వాత సిల్క్ బోర్డ్, HSR ఈ జాబితా నుండి బయటపడతాయని ఆశిస్తున్నామననారు. ఔటర్ రింగ్ రోడ్, మరతహల్లి కదలలేనివని మరొక వినియోగదారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రదేశాలను కలిపే ఒకే ఒక రహదారి ట్రాఫిక్ జామ్‌కు కారణమని గుర్తించడానికి మేధావి కానవసరం లేదని కామెంట్స్ కనిపించాయి. ప్రభుత్వాలు పట్టించుకోని వైఖరి కారణంగానే అవసరమైన స్థాయిలో రోడ్ల నిర్మాణం జరగలేదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.