deepseek

డీప్‌సీక్ యాప్ డౌన్‌లోడ్ చేస్తే జైలు శిక్ష

కృత్రిమ మేధస్సులో చైనా ప్రభావాన్ని అరికట్టడానికి అమెరికా సెనేటర్ జోష్ హాలే ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే డీప్‌సీక్ వంటి చైనా అభివృద్ధి చేసిన AI మోడళ్లను డౌన్‌లోడ్ చేసుకునే వ్యక్తులకు 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, $1 మిలియన్ జరిమానా లేదా రెండూ జరిమానాలు విధించబడతాయి. అమెరికా, చైనా దేశాలు AI ఆధిపత్యం కోసం పోటీ పడుతున్న తరుణంలో ఈ చర్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని సూచిస్తుంది. విషయం ఏంటంటే అమెరికా అండ్ చైనా మధ్య AI టెక్నాలజీ దిగుమతి, ఎగుమతిని అరికట్టడానికి అలాగే దానిని ఉల్లంఘించే వారికి కఠినమైన శిక్షలతో సహా డీకప్లింగ్ అమెరికాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెపాబిలిటీస్ ఫ్రమ్ చైనా యాక్ట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు .గత వారం దాఖలు చేసిన ఈ బిల్లు చైనా AI మోడల్స్ ని అమెరికన్లు వాడకుండా నిషేధం చేస్తుంది. ఇందులో AI స్టార్ డీప్‌సీక్ కూడా ఉంది. హార్వర్డ్ AI పరిశోధకుడు బెన్ బ్రూక్స్ ఈ చర్యని ఇప్పటివరకు AI పై అత్యంత చట్టపరమైన చర్యగా నిలుస్తుందని అన్నట్లు ఒక నివేదిక పెరిగింది.

అమెరికా సెనేటర్ ఎం చెబుతుంది ? “చైనీస్ AIలోకి వెళ్లే ప్రతి డాలర్ అండ్ గిగ్ డేటా చివరికి అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగించే డాలర్లు & డేటా. అమెరికా మన స్వంత బలాన్ని పణంగా పెట్టి మన అతిపెద్ద ప్రత్యర్థిని శక్తివంతం చేయదు” అని జోష్ హాలీ ఒక ప్రకటనలో తెలిపారు. డీప్‌సీక్‌ డేటా-హార్వెస్టింగ్, తక్కువ-ధర AI మోడల్, ఇది అంతర్జాతీయ ఆందోళనను రేకెత్తించింది అలాగే అమెరికన్ టెక్నాలజీ స్టాక్‌ల పతనానికి గురిచేసింది” అని కూడా అభివర్ణించారు. జోష్ హాలీ బిల్లు అమెరికన్ కంపెనీలు చైనాలో AI పై పరిశోధన చేయకుండా లేదా చైనీస్ సంస్థలతో సహకరించకుండా నిషేధించాలని ప్రతిపాదిస్తుంది. దింతో అమెరికన్ కంపెనీలు చైనీస్ AI అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టకుండా నిరోధిస్తుంది.

Related Posts
ప్రపంచ రికార్డు సాధించిన 7వ తరగతి విద్యార్థి..
yoga

తమిళనాడులోని 7వ తరగతి విద్యార్థిని జెరిదిషా, ఇనుప మేకుల పై 50 యోగా ఆసనాలను 20 నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన Read more

కేజ్రీవాల్‌పై దాడికి యత్నం
liquid thrown on arvind kej

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన Read more

కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
Power struggle in Karnataka Congress

డీకే శివకుమార్‌ ‘పవర్‌’ను తగ్గించే ముమ్మర ప్రయత్నాలు బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. సీఎం పదవిని డీకే శివకుమార్‌కు అందకుండా చేయడానికి సీఎం Read more

కేఆర్ఎంబీ సమావేశం వాయిదా.. ఏపీ సర్కార్ కీలక అభ్యర్థన
Postponement of KRMB meeting.. Key request of AP Sarkar

ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ Read more