हिन्दी | Epaper

Zelenskyy: తన జీతం, కుటుంబ ఆస్తులను వెల్లడించిన జెలెన్‌స్కీ

Vanipushpa
Zelenskyy: తన జీతం, కుటుంబ ఆస్తులను వెల్లడించిన జెలెన్‌స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గతేడాది తన కుటుంబ ఆదాయ వివరాలను వెల్లడించారు. ప్రభుత్వాధికారులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడం ఉక్రెయిన్‌లో తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2024లో తాను తీసుకున్న వేతనం, తన కుటుంబ ఆస్తులు, ఆదాయం, ఖర్చులు వంటి వాటిని వెల్లడించారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం డేటాను విడుదల చేసింది.
కుటుంబ ఆదాయం 15,286,193
జెలెన్‌స్కీ తాజా డిక్లరేషన్ ప్రకారం.. 2024లో ఆయన కుటుంబ ఆదాయం 15,286,193 హ్రైవ్నియాలు. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 3.15 కోట్లు. ఇందులో ప్రభుత్వ సేల్స్ బాండ్స్ నుంచి వచ్చిన 8,585,532 (రూ.1.77 కోట్లు) హ్రైవ్నియాలు ఉన్నాయి. మిగిలిన మొత్తం అధ్యక్షుడి వేతనం, బ్యాంకు వడ్డీ, ప్రైవేటు రియల్ ఎస్టేట్ అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన చెల్లింపులు ఉన్నట్టు ‘ది కీవ్ ఇండిపెండెంట్’ పేర్కొంది.

తన జీతం, కుటుంబ ఆస్తులను వెల్లడించిన జెలెన్‌స్కీ

అధ్యక్షుడి కుటుంబ ఆదాయంలో పెరుగుదల
అంతకుముందు ఏడాది జెలెన్‌స్కీ, ఆయన కుటుంబ సభ్యుల ఆదాయం 316,700 డాలర్లు (రూ. 2.7 కోట్లు). అంటే 2023తో పోలిస్తే అధ్యక్షుడి కుటుంబ ఆదాయంలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈ పెరుగుదల అద్దెల ద్వారా వచ్చిందేనని పత్రిక తెలిపింది. అయితే, అధ్యక్షుడి కుటుంబ ఆస్తులు, రియల్ ఎస్టేట్, వాహనాలలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది.
సోషల్ మీడియా నివేదికలు
జెలెన్‌స్కీ బిలియనీర్ అని గతంలో సోషల్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ‘ఫోర్బ్స్ మిడిల్ఈస్ట్’ మాత్రం.. జెలెన్‌స్కీ బిలియనీర్ కావడానికి చాలా దూరంలో ఉన్నారని తెలిపింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు ఆయన నికర ఆస్తి దాదాపు 20 మిలియన్ డాలర్లు మాత్రమేనని పేర్కొంది. మాజీ కళాకారుడైన జెలెన్‌స్కీ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆయన సంపద హెచ్చుతగ్గులకు లోనవుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

భారత పౌరులు మాకు మద్దతు ఇవ్వాలి: ఇరాన్‌

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

అమెరికా రాయబార కార్యాలయంపై బాంబు దాడి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులు

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇంధన నిల్వపై కేంద్రం కీలక ఆదేశాలు.. పెట్రోల్ కొరత లేదు!

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక స్థితిలో పాకిస్తాన్ విలవిల

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

మోదీ నా ఫ్రెండ్.. త్వరలోనే భారత్‌కు వస్తానని సందేశం

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

డాలర్‌కు ఇరాన్ చెక్: హార్ముజ్ జలసంధిలో ఇక చైనా ‘యువాన్’ రాజ్యమేనా?

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

జపాన్ సముద్రంపై ఉత్తర కొరియా క్షిపణి గర్జన: ప్రాంతీయ ఉద్రిక్తతలు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభంతో ప్రజల ఇక్కట్లు

📢 For Advertisement Booking: 98481 12870