हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?

Vanipushpa
Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలిసారి ఒక భారతీయ(Indian) వ్యోమగామి వెళుతున్నారు. ఆక్సిమ్ 4 మిషన్‌(Axiom 4 Mission)లో భాగంగా వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల్లో ఇస్రో(Isro)కు చెందిన శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. ఈ మిషన్‌కు కమాండర్‌గా పెగ్గీ విట్సన్, పైలట్‌గా ఇస్రోకి చెందిన శుభాన్షు శుక్లా, మిషన్ స్పెషలిస్ట్‌లుగా పోలండ్‌కి చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి విస్నివ్స్కీ, హంగరీ నుంచి టిబోర్ కాప్ ఉన్నారు. అయితే, ఈ ప్రోగ్రామ్ కోసం ఈ నలుగురితో పాటు మరో ముగ్గురికి కూడా శిక్షణ ఇచ్చారు.
‘వెళ్లేది నలుగురైతే శిక్షణ ఏడుగురికి ఎందుకు?’
అంతరిక్ష ప్రయాణాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఒక్కసారి ప్రయోగం, ప్రయాణ తేదీ నిర్ణయించిన తర్వాత అన్నీ పకడ్బందీగా జరగాలి. వాతావరణం సరిగ్గా లేకపోతే ఒకటి రెండు రోజులు వాయిదా వేస్తారు. తాజా ఆక్సిమ్ 4 మిషన్ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల రెండుసార్లు వాయిదా పడింది. వాతావరణం బాగోలేకపోతే వాయిదా వేస్తారు. కానీ, వెళ్లాల్సిన వ్యోమగాముల్లో ఎవరికైనా ఇబ్బంది ఎదురైతే అప్పుడేం చేస్తారు. అందుకే ప్రతి అంతరిక్ష ప్రయాణానికి వెళ్లాల్సిన వారితో పాటుగా బ్యాకప్ టీమ్‌ను కూడా సిద్ధం చేస్తారు. ఆక్సిమ్ 4 ప్రయాణంలో నలుగురు వ్యోమగాములతో పాటు మరో ముగ్గురు బ్యాకప్ టీమ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారిలో ఇస్రోకు చెందిన వ్యోమగామి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒకరు. ఆయన పైలట్ శుభాన్షు శుక్లాకు బ్యాకప్‌గా ఉన్నారు. వారితో పాటు కమాండర్ పెగ్గీ విట్సన్‌కి బ్యాకప్‌గా మైఖెల్ లోపెజ్ అనే అమెరికన్, స్పానిష్ ఆస్ట్రోనాట్ సిద్ధంగా ఉన్నారు.ఇక మిషన్ స్పెషలిస్ట్‌కి బ్యాకప్‌గా గుల్యా సెరెనీ ఉన్నారు. వీరు కూడా ఆక్సిమ్ 4 సభ్యులతో పాటుగా పూర్తి స్థాయిలో సమాన శిక్షణ తీసుకుంటారు.

Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?
Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?

ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ముందుగా నిర్ధరించిన వారిలో ఎవరైనా అంతరిక్ష ప్రయాణం చేయలేకపోతే, వారి స్థానంలో బ్యాకప్ సభ్యులను ఉపయోగించుకుంటారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు కూడా… ఆయనకు బ్యాకప్ టీంలో రవీష్ మల్హోత్రా అనే మరో భారతీయ వ్యోమగామికి శిక్షణ ఇచ్చారు.
ఇస్రో గగనయాన్ ప్రాజెక్ట్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు శుక్లా, బాలకృష్ణన్ నాయర్‌ కూడా ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు గగన్‌యాన్‌ కోసం సిద్ధమవుతున్నారు.
శుక్లా చేయబోయే 14 రోజుల అంతరిక్ష ప్రయాణం
ఇస్రో భవిష్యత్ ప్రయోగాలకు, భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.
అంతరిక్షంలోకి వెళ్లే ముందు వ్యోమగాములకు విభిన్న అంశాలపై లోతైన, సమగ్ర శిక్షణ అందిస్తారు. ఇందుకోసం చాలా ఖర్చవుతుంది. భారత్ తన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు చాలా పెద్ద ఎత్తున నిధులు చెల్లించాల్సి ఉంటుంది.
వ్యోమగాములకు శారీరక, మానసిక అంశాలతో పాటు, సాంకేతిక అంశాలు, భాషా పరమైన శిక్షణ, సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాలు ఇలా చాలా రకాల శిక్షణలు అందిస్తారు.
‘టెక్నికల్, ఆపరేషనల్ ట్రైనింగ్’
నాసా అందించిన వివరాల ప్రకారం వ్యోమగాములకు టెక్నికల్, ఆపరేషనల్ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందుకోసం స్పేస్ స్టేషన్ నమూనాను ఇక్కడే తయారు చేసి, అందులో వారికి పూర్తి స్థాయిలో అన్ని రకాల శిక్షణలు ఇస్తారు. అంటే అక్కడ ఏయే పరికరాలను ఎలా ఉపయోగించాలో భూమ్మీదే సిమ్యులేటర్‌లో లాంచింగ్, డాకింగ్, ల్యాండింగ్, ఎమర్జెన్సీ అంశాలపై శిక్షణనిస్తారు.
మైక్రో గ్రావిటీ శిక్షణ
అంతరిక్షంలోకి తొలిసారి వెళ్లబోయే వ్యోమగాములు అక్కడ భార రహిత స్థితికి పూర్తి స్థాయిలో అలవాటు పడేలా భూమ్మీదే శిక్షణ ఇస్తారు.
ఇందుకోసం స్విమ్మింగ్‌పూల్‌లో అతిపెద్ద ల్యాబ్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లాంటి నమూనాను ఏర్పాటుచేసి అక్కడ శిక్షణ ఇస్తారు. దీని వల్ల వ్యోమగాములకు భార రహిత స్థితి అలవాటు అవుతుంది. దీంతో పాటు మైక్రో గ్రావిటీని అలవాటు చేసేలా పారాబోలిక్ ఫ్లైట్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు.

Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?
Axiom 4 Mission: వ్యోమగాములకు ఎలాంటి శిక్షణ ఇస్తారు?

నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యోమగాములు అత్యంత చురుగ్గా, వేగంగా స్పందించేందుకు T-38 జెట్ ట్రైనింగ్ అని ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు. ఇందులో వారు అత్యధిక గురుత్వాకర్షణ శక్తి (జీ ఫోర్స్) దగ్గర కూడా పనిచేసేలా, ప్రతిచర్యలు చేయగలిగేలా శిక్షణ ఇస్తారు.
ఇది వారు ఐఎస్ఎస్ నుంచి తిరిగి భూమ్మీదకు వచ్చేటప్పుడు ఎదుర్కొనే పరిస్థితి. ఇది చాలా క్లిష్టమైన సమయం. అందుకే వ్యోమగాములు ఈ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక అంతరిక్షంలోకి వెళ్లి వాళ్లు నిర్వహించాల్సిన అన్ని ప్రయోగాలపైనా శిక్షణ ఇస్తారు.
అక్కడ డేటా సేకరణ, డేటా మేనేజ్‌మెంట్, విపత్కర పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలి? టెక్నికల్ సమస్యలు వస్తే ఎలా పరిష్కరించాలో అన్నీ ముందే శిక్షణ ఇస్తారు.
లాంచ్‌కు ముందు శిక్షణ
ఈ శిక్షణా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక అన్ని పరీక్షలూ పాసైన వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపేందుకు ఎంపిక చేస్తారు. క్వారంటైన్, వైద్య పరీక్షలు, ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తయ్యాక… లాంచింగ్ రోజు ఆస్ట్రోనాట్లను తమ స్పేస్ సూట్లు వేసుకుని సిద్ధం చేస్తారు.
ఈ స్పేస్ సూట్లను ఎక్స్‌స్ట్రా వెహికిలర్ మొబిలిటీ యూనిట్స్ అంటారు. ఆ తర్వాత అన్ని సిస్టమ్స్ సమగ్రంగా చెక్ చేస్తారు. లాంచ్‌కు ముందు వ్యోమగాములు తమ కుటుంబ సభ్యులతో పరిమితంగా, నియంత్రిత పరిస్థితుల్లో మాట్లాడేందుకు అవకాశమిస్తారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారిని నేరుగా మాట్లాడనివ్వరు. వ్యోమగాములు మానసికంగా మరింత దృఢంగా ఉండేందుకు అవసరమైన సైకలాజికల్ సపోర్ట్ అందిస్తారు.

Read Also: Shukla Axiom-4: శుభాన్షు శుక్లా అంతరిక్షయాత్ర మళ్లీ వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
2:46

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

📢 For Advertisement Booking: 98481 12870