📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

USA Vice President: భారత్, పాక్ యుద్ధం పై మేము జోక్యం చేసుకోము: జేడీ వాన్స్

Author Icon By Anusha
Updated: May 9, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియా,పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తమకు సంబంధం లేని విషయమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, తాను, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. జేడీ వాన్స్‌ తన కుటుంబంతో భారత పర్యటనకు వచ్చిన సమయంలో పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. దాదాపు వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్‌ల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు, ఘర్షణలపై జేడీ వాన్స్ స్పందిస్తూ ‘ఇది మా వ్యవహారం కాదు ఇందులో మేము జోక్యం చేసుకోబోం మేము చేయగలిగేది ఒక్కటే వీళ్లు కొంచెం శాంతంగా ఉండేలా ప్రోత్సహించడమే. కానీ ఇది అమెరికా చొరవ తీసుకోవాల్సిన యుద్ధం కాదు. ఇది మాకు సంబంధం లేంది.భారత్ ఆయుధాలు విడిచిపెట్టమని చెప్పలేం.పాకిస్థాన్‌ను కూడా అలాగే చెయ్యమని చెప్పలేం. అందుకే మేము ఈ సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించే దిశగా కొనసాగుతున్నాం’ అని పేర్కొన్నారు. అంతర్జాతీయ సంఘర్షణల నుంచి అమెరికా వైదొలగాలని కోరుకుంటోందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోవ వాన్స్(JD Vance) చెప్పడం గమనార్హం. పహల్గామ్ దాడిపై దర్యాప్తులో భారత్‌కు పాకిస్థాన్‌‌ సహకరించాలని వాన్స్ చెప్పిన విషయం తెలిసిందే.

ప్రయోగించిన

ఇది పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారకూడదు. దేవుడే రక్షించాలి, అణుయుద్ధంగా మారితే అత్యంత ప్రమాదకరం. కానీ ఇలాంటి పరిణామాలు జరుగుతాయని మేము అనుకోలేదు’ అని వాన్స్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కొద్దిసేపటికే ముందు భారతదేశంలోని జమ్మూ, పఠాన్‌కోట్ తదితర నగరాలలోని సైనిక స్థావరాలపై పాకిస్థాన్ దాడికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ క్రమంలో భారత వాయుసేన క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా ఇస్లామాబాద్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులను అడ్డుకుని, కూల్చివేసింది. అలాగే, ఆరు పాక్ యుద్ధ విమానాలు, 50కిపైగా డ్రోన్లను ధ్వంసం చేసింది.

JD Vance

ప్రతీకార

దీనికి ముందు భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ‘భారత్, పాకిస్థాన్‌లు ఒకదానిపై ఒకటి ప్రతీకార దాడులు చేసుకుంటున్నాయి.ఇది ఆపాలని కోరుతున్నాను. నేను ఏమైనా సహాయంగా చేయగలిగితే, నేను సిద్ధంగా ఉన్నాను’ అని ట్రంప్(Donald Trump) అన్నారు. ఇరు దేశాలతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కశ్మీర్ సమస్య భారత్, పాకిస్థాన్ మధ్య శతాబ్దాలు కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు.

Read Also :Union Minister: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి భద్రత పెంపు ఎందుకంటే?

#IndiaPakistanTensions #IndiaStrikesBack #JDVance #OperationSindhoor #USResponse Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.