📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Virat Kohil: మన వీరులకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్” : విరాట్‌ కోహ్లీ

Author Icon By Vanipushpa
Updated: May 9, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohil) ఇండియన్‌ ఆర్మీ (India Army) గురించి ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుతం భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, దాడి ప్రతిదాడుల మధ్య కోహ్లీ ఈ పోస్ట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. “ఈ క్లిష్ట సమయాల్లో మన దేశాన్ని తీవ్రంగా రక్షించినందుకు మన సాయుధ దళాలకు మేం సంఘీభావం తెలియజేస్తున్నాం. వారికి నా సెల్యూట్‌. మన వీరుల అచంచల ధైర్యసాహసాలకు, మన గొప్ప దేశం కోసం వారు, వారి కుటుంబాలు చేసే త్యాగాలకు హృదయపూర్వక కృతజ్ఞతకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్” (Jai Hind) అంటూ కోహ్లీ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు. అంతకంటే ముందు రోహిత్‌ శర్మ సైతం ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టాడు. ఇలా భారత క్రికెటర్లు మన దేశ సైనికులకు నైతిక మద్దతు ఇవ్వడం వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంచుతుందని నెటిజన్లు అంటున్నారు.

Virat Kohil :మన వీరులకు మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై హింద్” : విరాట్‌ కోహ్లీ

ఐపీఎల్‌ 2025ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా
ఇకపోతే ఐపీఎల్‌ 2025ను బీసీసీఐ వారం రోజుల పాటు వాయిదా వేసింది. అయితే వారం తర్వాత అయినా మ్యాచ్‌లు తిరిగి ప్రారంభిస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఒక వేళ భారత్‌, పాక్‌ మధ్య ఈ యుద్ధ వాతావరణం తగ్గుముఖం పడితే మ్యాచ్‌లు తిరిగి నిర్వహించే ఛాన్స్‌ ఉంది. ఒక వేళ అలా జరగకపోతే.. తిగిరి ఆగస్టులో మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌ 18వ సీజన్‌లో 12 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. సీజన్ చివరిలో IPL మ్యాచ్‌లు షెడ్యూల్ చేసిన వేదికలు ధర్మశాల, అహ్మదాబాద్, జైపూర్ సరిహద్దుకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌ను ప్రస్తుతానికి నిలిపివేయడమే మంచిదని బీసీసీఐ భావించింది.
ఆసియా కప్‌ రెండు రద్దు అయ్యే అవకాశం
అయితే.. ఆగస్టులో తిరిగి మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ సూచన ప్రాయంగా అనుకున్నప్పటికీ.. దానికి ఇంకా మూడు నెలలకు పైగా సమయం మిగిలి ఉన్నందున, మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలను తరువాత పరిశీలించనున్నారు. ఆగస్టు 17 నుండి మూడు T20Iలు, ODIల కోసం టీమిండియా బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ తర్వాత ఆగస్టు-సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాతో సిరీస్‌, ఆసియా కప్‌ రెండు రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ టైమ్‌లో ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఆ మ్యాచ్‌లను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నై, హైదరాబాద్‌, తిరువనంతపురం, బెంగళూరు వేదికల్లోనే మిగిలిన మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

Read Also: Ministry of Defence: దేశంలోని మీడియా సంస్థలకు కీలక హెచ్చరిక చేసిన కేంద్రం

"Operation Sindhur" "Telugu News Ap News in Telugu be indebted Breaking News in Telugu Google News in Telugu Jai Hind” Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to our heroes Virat Kohli We will forever

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.