అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సుంకాలను విధింపునకు యూఎస్(US)లోని మరో కోర్టు అనుమతించింది. అయితే ట్రంప్(Trump) విధించిన సుంకాలు అమలు కాకుండా ట్రేడ్ కోర్టు(Trade Court) నిలిపివేయగా, దీనిపై సర్కార్ అప్పీల్ దాఖలు చేసింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం, ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా పరిపాలనాధికారులు స్పందించాలని చెప్పింది.

అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్లు
కాగా, ఏప్రిల్ 2వ తేదీన లిబరేషన్ డే సందర్భంగా పలు దేశాలపై భారీ సుంకాలను ట్రంప్ విధించగా, అధికార పరిధిని అతిక్రమించారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ న్యూయార్క్‌లోని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం, ట్రంప్‌కు అనుకూల తీర్పు ఇవ్వలేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.
చైనా- అమెరికా ఒప్పందం
ఒప్పందాలను కుదుర్చుకోవడానికి జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. అయితే ట్రంప్ సర్కార్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. చైనా- అమెరికా ఒప్పందం, భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణ విషయాలను ప్రస్తావించింది. ఆ నేపథ్యంలో మరో కోర్టులో అప్పీల్ చేయగా, ఇప్పుడు అనుకూల తీర్పు వచ్చింది. అయితే కోర్టు వాదనల సమయంలో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి రెండు దేశాలకు వాణిజ్య ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చాకే భారత్, పాకిస్థాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా ప్రభుత్వం వెల్లడించడం గమనార్హం. కాల్పుల విరమణలో మూడో దేశం జోక్యం లేదని భారత్ ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా మళ్లీ అదే వాదనను వినిపించడం వినిపిచింది.
Read Also: Donald Trump : ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు స్పష్టీకరణ