America: అమెరికాలో కాల్పుల మోత

Read Time:  1 min
అమెరికాలో కాల్పుల మోత
అమెరికాలో కాల్పుల మోత
FONT SIZE
GET APP

అమెరికా (America) వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. లాస్‌ ఏంజెలెస్‌తోపాటు నార్త్‌ కరోలినా(North Carolina)లో దుండగులు కాల్పులకు పాల్పడగా, కొలరాడో(Colorado)లో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనల్లో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.
నార్త్‌ కరోలినాలోని హికోరిలో ఓ ప్రైవేట్‌ ప్రాపర్టీలో జరిగిన కాల్పల్లో ఒకరు మృతిచెందగా, 11 మంది గాయపడ్డారు. అదేవిధంగా లాస్‌ ఏంజెలెస్‌ నగరంలోని బాల్డివన్‌ పార్క్‌లో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఓ పోలీసు అధికారి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు.

America: అమెరికాలో కాల్పుల మోత
America: అమెరికాలో కాల్పుల మోత

పోలీసులు అదుపులో మహమ్మద్‌ సబ్రీ సోలిమా
కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడికి పాల్పడ్డాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ మండే స్వభావం కలిగిన ద్రావణ సీసాలను విసిరాడు. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనుమానితుడు మహమ్మద్‌ సబ్రీ సోలిమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ ఈ ఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు.

Read Also: Fans Violence: విజయోత్సవం హింసాత్మకంగా మారడంతో

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.