Hijab: ఇరాన్ లో మహిళలపై నిఘా – హిజాబ్ వివాదం మరింత తీవ్రం

Read Time:  1 min
ఇరాన్ లో మహిళలపై నిఘా – హిజాబ్ వివాదం మరింత తీవ్రం
ఇరాన్ లో మహిళలపై నిఘా – హిజాబ్ వివాదం మరింత తీవ్రం
FONT SIZE
GET APP

2022లో మహసా అమినీ మరణంతో ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తూ మహిళలపై నిఘా పెంచింది. ఇప్పటికే మోరల్ పోలీసులను ఏర్పాటు చేసిన ఇరాన్ ప్రభుత్వం, ఇప్పుడు హిజాబ్ లేకుండా బయటకు వచ్చే మహిళలను గుర్తించేందుకు అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

ఇరాన్ లో మహిళలపై నిఘా – హిజాబ్ వివాదం మరింత తీవ్రం

డ్రోన్ల ద్వారా నిఘా – ఎలా పనిచేస్తుంది?
వీధుల్లో డ్రోన్లను వినియోగించి మహిళలపై నిఘా ఉంచుతోంది. హిజాబ్ ధరించని మహిళలను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగిస్తోంది. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించిన మహిళలకు మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపుతుంది. వాహనాల్లో హిజాబ్ లేకుండా ప్రయాణిస్తే, డ్రోన్ ద్వారా సమాచారం అందించి వాహనదారుడిని హెచ్చరిస్తారు. హెచ్చరికలను ఖాతరు చేయకుండా కొనసాగితే, వాహనాన్ని సీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నజర్ యాప్ – చుట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడానికి
హిజాబ్ ధరించని మహిళల గురించి ఫిర్యాదు చేసేందుకు ‘నజర్’ అనే యాప్ ను ప్రవేశపెట్టింది.
చుట్టుపక్కల వారు మహిళల గురించి ఫిర్యాదు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
విద్యాసంస్థల్లో కొత్త నిబంధనలు
టెహ్రాన్‌లోని అమిర్ కబీర్ యూనివర్సిటీ వర్సిటీ ప్రవేశద్వారం వద్ద ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అమర్చింది. హిజాబ్ లేకుండా విద్యార్థినులు వస్తే, వారిని గుర్తించి హెచ్చరిస్తారు. విద్యాసంస్థల స్థాయిలో కూడా హిజాబ్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. 2022లో మహసా అమినీని మోరల్ పోలీసులు అరెస్ట్ చేయగా, కస్టడీలో ఆమె మరణించింది. ఈ ఘటన ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.
ఆందోళనలు పెద్ద ఎత్తున జరగగా, మహిళలు బహిరంగంగా హిజాబ్ ధరించకుండా నిరసన తెలిపారు.
ప్రభుత్వం ఆందోళనలను అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.