हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Trump: ఇరాన్​పై అమెరికా సైనిక చర్య సరికాదన్న రష్యా

Vanipushpa
Trump: ఇరాన్​పై అమెరికా సైనిక చర్య సరికాదన్న రష్యా

ఇజ్రాయెల్‌, ఇరాన్‌(Israel-Iran) యుద్ధంలోకి ప్రవేశించేందుకు అమెరికా(America) రంగం సిద్ధం చేసుకుంటోంది. అణు కార్యక్రమాన్ని బూచిగా చూపి ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం(White House) నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టే అంశంపై రెండు వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని వైట్‌హౌస్‌ (White House) క్లారిటీ ఇచ్చింది. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్‌ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌(Carolin livit) వెల్లడించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన పరిష్కారానికే ట్రంప్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె తెలిపారు.

Trump: ఇరాన్​పై అమెరికా సైనిక చర్య సరికాదన్న రష్యా
Trump: ఇరాన్​పై అమెరికా సైనిక చర్య సరికాదన్న రష్యా

స్పందించిన రష్యా

మరోవైపు అమెరికా సైనిక చర్య వార్తలపై రష్యా స్పందించింది. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ అంశంపై మధ్యవర్తిత్వానికి సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఇరుదేశాల మధ్య ఒప్పందం అనేది టెహ్రాన్‌ యురేనియం సుసంపన్నతను నిషేధించడం, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందని కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారం కోసమే ఆలోచిస్తారని, ఆయన ప్రధాన శాంతికర్త అని తెలిపారు. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా తాము తీసుకునే నిర్ణయాన్ని సిద్ధం చేసుకుంటోంది. రెండు వారాల వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇరాన్‌పై సైనిక చర్యపై నిర్ణయం తీసుకోనున్నారు.

బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ

ఆయన బలం ద్వారా శాంతిని నెలకొల్పే అధ్యక్షుడని, ఏ సమస్యకైనా దౌత్య పరిష్కారం ఉంటే దాన్నే ఆయన ఎంచుకుంటారని అన్నారు. అయితే అవసరమైన సమయంలో ఆయన తన బలాన్ని ఉపయోగించేందుకు భయపడరని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోని ప్రధాన ఆసుపత్రిపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. టెహ్రాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తాము అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే, వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలు: “ఇరాన్‌ అమాయకులపై దాడులు చేస్తోంది” హెచ్చరిక: “ఇది వారి దేశానికి భారీ మూల్యం తీసుకొస్తుంది” తాము లక్ష్యంగా చేసేది అణు కేంద్రాలు కానీ, ఇరాన్ లక్ష్యం ప్రజలు, ఆసుపత్రులు

Read Also: Axiom-4 : ‘యాక్సియం-4′ ప్రయోగం మళ్లీ వాయిదా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870