📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Pope Francis: సంప్రదాయానికి భిన్నంగా పోప్ ఫ్రాన్సిస్ ఖననం

Author Icon By Vanipushpa
Updated: April 22, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోప్ ఫ్రాన్సిస్ తన మరణానంతరం ఖననానికి సంబంధించి చారిత్రకంగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. గతంలో మరణించిన పోప్‌లను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించరాదని ప్రకటించారు. తన అంత్యక్రియలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాన్ని వెల్లడించారు. శతాబ్దాలుగా వస్తున్న వాటికన్ సంప్రదాయానికి భిన్నంగా, తన మరణానంతరం భౌతికకాయాన్ని వాటికన్ నగరం వెలుపల రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననం చేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వెనుక బాసిలికాతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ప్రత్యేక ఇంటర్వ్యూలో ఫ్రాన్సిస్ ఈ విషయాన్ని చెప్పారు
సాధారణంగా, మరణించిన పోప్‌ల భౌతికకాయాలను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్నారు. 2023 డిసెంబర్ 12న మెక్సికన్ టెలివిజన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన అంత్యక్రియల ఏర్పాట్లను సరళతరం చేయాలనే ఉద్దేశ్యంతో, వాటికి సంబంధించిన విషయాలను ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో ఇప్పటికే చర్చించినట్లు పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో గాఢమైన అనుబంధం
రోమ్‌లోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికాతో పోప్ ఫ్రాన్సిస్‌కు గాఢమైన అనుబంధం ఉంది. ముఖ్యంగా, ఆ చర్చిలో కొలువైన ‘సేలస్ పోపులి రోమని’గా ప్రసిద్ధి చెందిన మేరీమాత, బాల ఏసు చిత్రాన్ని ఆయన ఎంతగానో ఆరాధిస్తారు. పోప్ హోదాలో విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు, తిరిగి వచ్చిన తర్వాత ఆయన తప్పకుండా ఈ చిత్రం ముందు ప్రార్థనలు చేస్తుంటారు. ఈ ప్రత్యేక బంధమే తన చివరి విశ్రాంతి స్థలంగా బాసిలికాను ఎంచుకోవడానికి కారణమని తెలుస్తోంది.
వాటికన్ వెలుపల ఖననం చేయడం అరుదు
చారిత్రకంగా చూస్తే, పోప్‌లను వాటికన్ వెలుపల ఖననం చేయడం చాలా అరుదు. 1903లో మరణించిన పోప్ లియో-13 భౌతికకాయాన్ని మాత్రం ఆయన కోరిక మేరకు రోమ్‌లోని సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో ఖననం చేశారు. ఇక సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఇప్పటివరకు ఆరుగురు పోప్‌ల అంత్యక్రియలు జరిగాయి. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9ను అక్కడ ఖననం చేశారు. సుమారు మూడున్నర శతాబ్దాల తర్వాత, పోప్ ఫ్రాన్సిస్ తన చివరి కోరిక ద్వారా మళ్లీ బాసిలికాకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ తన మరణానంతరం ఖననానికి సంబంధించి చారిత్రకంగా వస్తున్న సంప్రదాయాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నారు. గతంలో మరణించిన పోప్‌లను వాటికన్ నగరంలోని సెయింట్ పీటర్స్ బాసిలికాలో ఖననం చేయడం ఆనవాయితీగా ఉండేది. కానీ పోప్ ఫ్రాన్సిస్ ఈ సంప్రదాయాన్ని అనుసరించరాదని ప్రకటించారు.

Read Also: Jedi Vance : మోడీ భేటీ భారత్-అమెరికా వాణిజ్య బలకరణం

#telugu News Ap News in Telugu Breaking News in Telugu burial breaks tradition Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pope Francis Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.