Pakistan: పాక్ లో పెట్రోల్ బంక్ లు మూత.. ఇంధన కొరతతో ఇబ్బందులు

Read Time:  1 min
Iran War: Indian oil companies lose Rs. 2 thousand crores per day
Iran War: Indian oil companies lose Rs. 2 thousand crores per day
FONT SIZE
GET APP

భారత్ (Bharth) తో కయ్యానికి కాలుదువ్విన పాకిస్థాన్ (Pakistan) కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓవైపు భారత సైన్యం చేస్తున్న ప్రతీకార దాడులను తట్టుకోలేకపోతున్న పాక్ కు తాజాగా ఇంధన సంక్షోభం ముప్పు భయపెడుతోంది. దేశంలో ఇంధన (Petrol and Diesel) కొరత ఏర్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లోని పెట్రోల్ బంక్ లను రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శుక్రవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. శని, ఆదివారాలు బంక్ లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధన నిల్వలు పెంచుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Pakistan: పాక్ లో పెట్రోల్ బంక్ లు మూత.. ఇంధన కొరతతో ఇబ్బందులు
Pakistan: పాక్ లో పెట్రోల్ బంక్ లు మూత.. ఇంధన కొరతతో ఇబ్బందులు

నిత్యావసరాల కొనుగోలుకు తిప్పలు
పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కుదేలవగా భారత్ తో యుద్ధ వాతావరణం మరింత అల్లాడిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నిత్యావసరాల కొనుగోలుకు కూడా పాక్ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) ముందు మరోసారి సాయం కోసం అర్థించింది. ఒక బిలియన్‌ డాలర్ల సాయాన్ని అందించేందుకు ఐఎంఎఫ్‌ అంగీకరించిందని పాక్‌ ప్రధాని కార్యాలయం తెలిపింది.

Read Also: Nawaz Sharif : భారత్‌తో దూకుడు వద్దు – పాక్‌ ప్రధానికి సూచన!

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.