Pahalgam Attack: పహల్గాం దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!

Read Time:  1 min
పహల్గాంలో దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!
పహల్గాంలో దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!
FONT SIZE
GET APP

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం, కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో సాధారణ స్థితిని పునరుద్ధరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో హమీ ఇచ్చింది. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దయింది. ‘ఆర్టికల్ 370ని ఒక టూల్‌గా వాడి కశ్మీర్‌లో బీభత్సం, హింస, అవినీతిని వ్యాప్తి చేస్తున్నారు’ అని నరేంద్ర మోదీ ఆ సమయంలో అన్నారు. గత పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని మోదీ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, పహల్గాంలో తాజా దాడి భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవల కాలంలోని తీవ్రవాద దాడులలో ఈనెల 22న జరిగిన దాడి అత్యంత దారుణమైనదిగా పరిగణిస్తున్నారు. ఈ దాడి తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పహల్గాం దాడితో కశ్మీర్ భద్రతపై ప్రజల ఆందోళనలు!

ఈ సంఘటన తర్వాత ప్రభుత్వ విధానం ఎలా ఉండనుంది?.
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి, కొందరు నిపుణులతో మాట్లాడింది.‘స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు’. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడమనేది 2014 నుంచి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన హామీ. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ చర్య జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పుతుందని ప్రభుత్వం చెప్పింది. భారత్‌లోని ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జమ్మూకశ్మీర్‌లో భూమిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపింది. పర్యాటకం, భద్రత అనేది జమ్మూకశ్మీర్ పాలసీలో ముఖ్యభాగంగా ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో పర్యటకుల సంఖ్య పెరిగిందని కేంద్రం చాలాసార్లు చెప్పింది. గణాంకాలు కూడా దీనిని ప్రతిబింబించాయి.
ఆర్టికల్ 370 రద్దు ప్రభావం ఎంత
ఆర్టికల్ 370 రద్దు చేసిన ఐదేళ్ల తర్వాత, 2024లో ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్‌ను సందర్శించారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇది జరిగింది. శ్రీనగర్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. కశ్మీరీలు ఇప్పుడు ‘స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు’ అన్నారు. “ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ పురోగతి కొత్త శిఖరాలను తాకుతోంది. స్థానిక ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాతే ఇది జరిగింది. దశాబ్దాలుగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఆర్టికల్ 370 గురించి జమ్మూకశ్మీర్‌ను, దేశ ప్రజలను తప్పుదారి పట్టించాయి” అన్నారు మోదీ. “రాజకీయ విధానం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ప్రతిరోజూ ముస్లిం జనాభాను దూరం చేసేలా, హిందూ జనాభాను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేస్తున్నారు” అని అజయ్ అన్నారు. “క్రమంగా ఇలాంటివాటికి ముగింపు పలుకుతూ మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారతీయ గుర్తింపులోకి తీసుకురావాలి. ఇది భారతీయ సమగ్రతను చాటేలా ఉండాలి. ఈ ప్రాంత అభివృద్ధికి సవాలుగా నిలుస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదం ఇతర అతివాద ఈ సంఘటన ప్రభుత్వ ప్రతిష్ఠపై, దాని కశ్మీర్ విధానంపై ఎటువంటి ప్రభావం చూపబోదని భారతీయ జనతా పార్టీ నమ్ముతోంది. ”
Read Also: Amit Shah : పాకిస్తానీయులు భారత్ విడిచి వెళ్ళాలి

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.