📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Phalgam Terror Attack: పహల్గామ్‌ ఉగ్రదాడితో సంబంధం లేదన్న పాకిస్థాన్ స్పందించిన ఒమర్ అబ్దుల్లా

Author Icon By Anusha
Updated: April 27, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని దాయాది పాకిస్థాన్ ప్రకటన చేసింది. కానీ, అంతలోనే ఆ దేశం మాటమార్చింది. పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి తాము సిద్దమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.ఈ ప్రకటనపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. తొలుత ఈ ఘటనను తోసిపుచ్చిన పాకిస్థాన్, భారత్‌పై నిందలు వేసిందని విమర్శించారు.ఇప్పుడు దర్యాప్తునకు సిద్ధమనడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని పాక్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

ప్రాధాన్యం

ఉగ్రదాడిపై విచారణకు తాము సిద్ధమని పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ శనివారం ప్రకటించారు. తొలుత ఈ దాడిని పాకిస్తాన్ ఖండించిందని, భారత్‌పై నిందలు వేసిందని ఆయన గుర్తు చేశారు. పహల్గామ్‌లో జరిగిన దాడిని పాక్ గుర్తించలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట ఈ దాడి వెనుక భారత్ ఉందని ఆరోపించారని ఆయన విమర్శించారు. మనపై ఆరోపణలు చేయడంలో ముందుండే వారికి ఇప్పుడేమీ చెప్పలేమని ఒమర్ అబ్దుల్లా అన్నారు. వారి ప్రకటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ‘దురదృష్టకరమైన ఆ ఘటన జరిగి ఉండాల్సింది కాదు’ అని ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన మాట్లాడుతూ ‘జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘటనతో తమ దేశంపై నిందలు వస్తున్నాయి’ అని అన్నారు. ‘విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం” అని షరీఫ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు.

పుల్వామా

అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి. పాకస్థాన్, చైనాతో కలిసి ప్రకటనలోని పదాలను మార్చడానికి ప్రయత్నించింది. గతంలో పుల్వామా, జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది. స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. కానీ, ఐరాస ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ భావించింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని దర్యాప్తునకు సిద్ధమని ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఇక, సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. దాయాది కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది.

Read Also: US Presidnet: భారత్ పాక్ వివాదంపై డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

#IndiaPakistan #JammuAndKashmir #OmarAbdullah #PahalgamAttack #PakistanDenial #ShehbazSharif Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.